ETV Bharat / politics

'రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్​ రెడ్డి రైతులనే కాదు - రాహుల్​నూ​ మోసం చేశారు' - harishrao chitchat with media - HARISHRAO CHITCHAT WITH MEDIA

BRS Leader Harish Rao Chit Chat : ఫోర్త్​ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. కందుకూరు, తుక్కుగూడ, ముచ్చెర్లలో జరుగుతున్న ఒప్పందాల వివరాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రాహుల్​ గాంధీని రేవంత్​ రెడ్డి మోసం చేశారన్నారు.

BRS Leader Harish Rao Chit Chat
BRS Leader Harish Rao Chit Chat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 6:57 PM IST

Harish Rao Sensational Comments on CM : సీఎం రేవంత్ రెడ్డి చిట్​చాట్ కాదు, చీట్ ​చాట్ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని బీఆర్ఎస్​ నేత హరీశ్​రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు అదానీకి అప్పగిస్తామని చెప్పిన సీఎం, అసెంబ్లీలో అడిగితే లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడానికి సీఎం చిట్​చాట్​లు వాడుకుంటున్నారని ఆక్షేపించారు. అలాగే రుణమాఫీ విషయంలో సీఎం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.

'రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్. రుణమాఫీ కాలేదని మీ మంత్రులు రోజూ చెప్తున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్​. చేశారా? రుణమాఫీ సవాల్​ ఏమైందో రైతులే చెబుతారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారమే 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రైతులనే కాదు రాహుల్​ను కూడా రేవంత్​ మోసం చేశారు. రుణమాఫీ సభకు రావాలని సీఎం మూడుసార్లు ఆహ్వానించినా రాహుల్​ రాలేదు.' అని హరీశ్​రావు అన్నారు.

వాల్మీకి కుంభకోణం గురించి సీఎం ఎందుకు మాట్లాడరు : కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం గురించి రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్​ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని హరీశ్​రావు ప్రశ్నించారు. తమపై సీఎం ఆరోపణలు చేస్తున్నారని, ఇద్దరం వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేద్దామని సవాల్​ చేశారు. వాల్మీకి కుంభకోణంపై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్​ నేతలకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్​, బీజేపీ కుమ్మక్కు కాబట్టే వాల్మీకి కుంభకోణంపై తెలంగాణలో దాడులు జరగడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై బీఆర్​ఎస్ వదిలిపెట్టదు, ఈడీని కలిసి వాల్మీకి కుంభకోణంపై విచారణ చేయాలని అడుగుతామని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేయాలని కోరారు.

నాలాలపై ఉన్న అన్ని భవనాలను కూల్చేయండి : 'బుద్ధభవన్​, జీహెచ్​ఎంసీ కార్యాలయం నాలాపై ఉన్నాయి. ముందు బుద్ధభవన్​, జీహెచ్​ఎంసీ కార్యాలయాన్ని కూలగొట్టాలి. మా ఎమ్మెల్యే రాజశేఖర్​ రెడ్డి భవనాలను ఎలా కూలగొడతారు?. నెక్లెస్​రోడ్​, లుంబినీపార్క్​, హోటళ్లు, క్లబ్​లు దేని కింద ఉన్నాయి. అవన్నీ పట్టా భూములు వారికి పరిహారం ఇవ్వండి. మంత్రి పొంగులేటి నివాసం నుంచి డ్రైనేజ్​ నీళ్లు ఎక్కడకు పోతున్నాయి? సీఎం పరోక్షంగా తన మంత్రిని తిడుతున్నారా? ప్రతిపక్షాలను టార్గెట్​ చేయడం మంచిది కాదు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలి. అలాగే చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​, నాలాలపై ఉన్న ఆస్తులన్ని కూల్చేయాలి.' అని బీఆర్​ఎస్​ హరీశ్​ రావు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ పెద్దల తమ్ముళ్లు భూములు కొంటున్నారు : సుప్రీంకోర్టు తీర్పుపై రేవంత్​, బండి సంజయ్ మాట్లాడడం తగదని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది, కవితకు బెయిల్​ వచ్చిందన్నారు. కవితకు బెయిల్​ రావడాన్ని కేశవరావు కూడా స్వాగతించారని గుర్తు చేశారు. ఫోర్త్ సిటీ పేరు మీద ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కందుకూరులో 385 ఎకరాల ప్రభుత్వ భూమి కొల్లగొట్టేందుకు ఒప్పందాలు జరిగాయన్నారు. తుక్కుగూడలోని 25 ఎకరాలు పేద రైతుల నుంచి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల తమ్ముళ్లు భూములు కొంటున్నారన్నారు. పీఏల పేర్ల మీద ముచ్చెర్లలో భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతామని హరీశ్​రావు స్పష్టం చేశారు.

నా ఇంటిని మీరే వెళ్లి కొలవండి అక్రమమని తేలితే కూల్చేయండి : ఆ నేతలకు పొంగులేటి సవాల్ - PONGULETI CHALLANGES BRS LEADERS

'మొన్న రేవంత్‌ అలా - నేడు భట్టి ఇలా - రుణమాఫీపై ఎవరి మాటలు నమ్మాలో మీరే చెప్పండి' - Harish Rao Fires on Congress

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.