ETV Bharat / politics

కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే - రేవంత్ తిట్లలో ఆదర్శంగా ఉన్నాడు : హరీశ్​రావు - Harish Rao Fires on Congress - HARISH RAO FIRES ON CONGRESS

Harish Rao Fires on CM Revanth : కేసీఆర్‌ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్‌ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లని హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Harish Rao Fires on Congress Guarantees
Harish Rao Fires on Congress Guarantees
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 12:45 PM IST

Updated : Apr 27, 2024, 1:06 PM IST

Harish Rao Participated BRS Formation Day Celebrations in Siddipet : తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. తనకు పదవులు ముఖ్యం కాదని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Harish Rao Comments on CM Revanth : అంతకుముందు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేటలో హరీశ్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ హైదరాబాద్‌లోని జలదృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం, నేడు దేశానికి ఆదర్శం అయిందని అన్నారు. పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని గుర్తు చేశారు. ఆనాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్‌ రెడ్డి అని, మరోవైపు రాజీనామా కోసం జిరాక్స్ పేపర్ ఇచ్చిన వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని హరీశ్‌రావు విమర్శించారు.

తిట్లలో ఆదర్శంగా రేవంత్‌ రెడ్డి : కేసీఆర్‌ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్‌రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాడు ఓటుకు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డికి పంపించాలని, అలాగే తాను కూడా 5 నిమిషాల్లో రాజీనామా లేఖను పంపిస్తానని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఉంటే - సీఎం రేవంత్​ రెడ్డికే ఫస్ట్​ ప్రైజ్ : హరీశ్‌రావు - harish rao counter to cm revanth

Harish Rao Fires on Congress Guarantees : తాను రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు తనను తిడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హస్తం పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాను తొలగిస్తానని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాలు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు అన్నారు.

"కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. బీఆర్ఎస్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. రైతుబంధు పథకాన్ని బీజేపీ కాపీ కొట్టి అమలు చేసింది. కేసీఆర్‌ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్‌ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. నేను రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారు. హామీలు అమలయ్యే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను." - హరీశ్‌రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి

ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను రాజీనామాకు సిద్ధం

ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ, కాంగ్రెస్​ నాయకులను ప్రజలు నిలదీయాలి : హరీశ్​రావు - Harish Rao Election Campaign

నేను రాజీనామా పత్రంతో వచ్చా - రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు - HARISH RAO VS CM REVANTH REDDY

Last Updated : Apr 27, 2024, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.