ETV Bharat / politics

కేసీఆర్​ అధ్యక్షతన 18న బీఆర్​ఎస్​ కీలక సమావేశం - ముఖ్య నేతలందరికీ ఆహ్వానం - KCR Review Meeting on elections - KCR REVIEW MEETING ON ELECTIONS

BRS Key Meeting on April 18 in Telangana Bhavan : ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

BRS Key Meeting
BRS Key Meeting on April 18 in Telangana Bhavan
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 7:17 PM IST

Updated : Apr 16, 2024, 7:47 PM IST

BRS Key Meeting on April 18 in Telangana Bhavan : లోక్​ సభ ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలపై చర్చించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బస్సు యాత్ర రూట్ మ్యాప్​పై చర్చించేందుకు గురువారం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొననున్నారు.

BRS Meeting on Parliament Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలతో పాటు ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.95 లక్షల చెక్కును కేసీఆర్ అందించనున్నారు. ఆ తర్వాత నేతలతో జరగనున్న సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్‌

రైతులకు భరోసా : ఇటీవల జరిగిన బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన తరుణంలో తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు బీఆర్​ఎస్​ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరవుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలను తెలుసుకొని, వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం నాటి సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్​పై కూడా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

బతికున్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా : కేసీఆర్ - BRS Praja Ashirwada Sabha

బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్​ఎస్​, పార్లమెంట్​ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తోంది. గత లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ, ఈ దఫా కనీసం గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్య నేతలైన కేటీఆర్​, హరీశ్​రావులు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ, కార్యకర్తలకు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

గొర్రె కసాయిని నమ్మినట్లు ప్రజలు రేవంత్​కు అధికారం ఇచ్చారు - మేం చెప్పినట్లే జరుగుతోంది : కేటీఆర్

అధినేత కేసీఆర్​ సైతం లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వాలపై ఆయా నియోజకవర్గాల వారీగా సమావేశమై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ప్రచారంలో భాగంగా ఎక్కువగా సభలు ఉండకుండా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ తరహా ప్రచారంతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లొచ్చని కేసీఆర్​ భావిస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

Last Updated : Apr 16, 2024, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.