ETV Bharat / politics

ప్రచారంలో జోరు పెంచిన గులాబీ దళం - 'పార్లమెంట్​లో గళం వినపడాలంటే బీఆర్ఎస్​ను గెలిపించాల్సిందే' - BRS Election Campaign 2024 - BRS ELECTION CAMPAIGN 2024

BRS Election Campaign 2024 : బీఆర్ఎస్​ను గెలిపిస్తే ప్రజాపోరాటాలకు గొంతుకగా ఉంటామని ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ సర్కార్‌ విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. కారు గుర్తుపై ఓటువేసి గెలిపిస్తే పార్లమెంట్‌ వేదికగా గళమెత్తుతామని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

Harish Rao Comments on BJP
BRS Election Campaign 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 12:10 PM IST

ప్రచారంలో జోరు పెంచిన గులాబీ దళం గళం వినపడాలంటే బీఆర్ఎస్​ గెలవాల్సిందే

BRS Election Campaign 2024 : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీఆర్​ఎస్​ జోరు పెంచింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనను లక్ష్యంగా చేసుకుని పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రైతుల విషయంలో ప్రభుత్వం వైఫల్యాలు తెలిసేలా పోస్ట్​కార్డు ఉద్యమం ప్రారంభించామని వివరించారు.

Harish Rao Comments on BJP : సుల్తాన్‌పూర్‌లో జరగనున్న కేసీఆర్​ బహిరంగ సభాస్థలిని హరీశ్​రావు పరిశీలించారు. భారీ ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైందని విమర్శించారు. కాంగ్రెస్​, బీజేపీలు తమ అధికారాలను కాపాడుకోడానికి రహస్య ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. అనంతరం బీజేపీ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు.

"రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతోంది. అన్నదాతల ఆత్మహత్యలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్​ గెలుస్తేనే కాంగ్రెస్​ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. బీజేపీ, కాంగ్రెస్​ రెండూ ఒకటే. కాంగ్రెస్​ రైతులకు ఇస్తానన్న రుణమాఫీ, బోనస్​ లోక్​సభ ఎన్నికల లోపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను."- హరీశ్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే

BRS Leaders Election Campaign : నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(BRS Leader Jagdish Reddy) పాల్గొన్నారు. లీక్‌, ఫేక్ కథనాలతో కాంగ్రెస్‌ సర్కార్‌ కాలం గడుపుతోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థి నేతలు తనపై రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని మెదక్‌ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.

తెలంగాణ ప్రజల కోసం బతికున్నంత వరకు పోరాడుతూనే ఉంటా : కేసీఆర్ - BRS Praja Ashirwada Sabha

BRS Leader Jagdish Reddy Comments : ప్రజల్లో తిరగాల్సిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదులు చేసుకుంటూ తిరుగుతున్నారని గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మోసం చేసే పార్టీలను పక్కనపెట్టి అభివృద్ధి బాటలో నడిపే బీఆర్ఎస్​ను దీవించాలని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామనాగేశ్వరరావు ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా మధిరలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలు తెలిసేలా పోస్టుకార్డు ఉద్యమం ప్రారంభించాం : మాజీ మంత్రి హరీశ్​రావు - Lok Sabha Elections 2024

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

కాషాయ పార్టీ మేనిఫెస్టో పేరు గొప్ప - ఊరు దిబ్బలా ఉంది : హరీశ్‌రావు - Harish Rao Reacts on BJP Manifesto

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.