ETV Bharat / politics

ఫోన్​ట్యాపింగ్​పై కామెంట్స్ - రాహుల్ గాంధీపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు - BRS Complaint Against Rahul Gandhi - BRS COMPLAINT AGAINST RAHUL GANDHI

BRS Complaint Against Rahul Gandhi : తుక్కుగూడ సభలో ఫోన్​ ట్యాపింగ్​పై మాట్లాడిన రాహుల్​ గాంధీపై బీఆర్​ఎస్ పార్టీ​ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని విజ్ఞప్తి చేసింది.

BRS Complaint to ECI Against Rahul Gandhi

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 11:58 AM IST

BRS Complaint Against Rahul Gandhi : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో(Phone Tapping Case) ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ పైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్​ఎస్​ కోరింది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తుక్కుగూడ సభ(Jana Jatara Sabha)లో రాహుల్ గాంధీ దురుద్దేశపూర్వకంగా టెలిఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్​పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి విన్నవించింది.

రాహుల్​ గాంధీ అబద్ధాలు, అసత్యాలను మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో బీఆర్ఎస్ పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్​ ప్రస్తావనను టెలిఫోన్​ ట్యాపింగ్​ అంశంతో ముడిపెడుతూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్​, ఇంటెలిజెన్స్​ వర్గాలను బీఆర్​ఎస్​ దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేశారని మండిపడింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. పోలీస్​ వ్యవస్థను దుర్వినియోగం చేసి, వేలాది మంది ఫోన్లను ట్యాప్​ చేశారని, ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందారని రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. దీనిపై వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం(ECI) చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫోన్ ట్యాపింగ్​ బాధితుల్లో నేనూ ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

BRS Fires on Rahul Gandhi : రాహుల్​ వ్యాఖ్యల వీడియోలను ఫిర్యాదుకు జత పరిచింది. కేవలం తమ పార్టీని బదనాం చేయాలన్న దురుద్దేశపూర్వక ఆలోచనతోనే రాహుల్​ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని సీఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్​ఎస్​ పేర్కొంది. అవి ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపింది. రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంటనే విచారణ చేపట్టాలని పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. తక్షణమే రాహుల్​ గాంధీతో పాటు కాంగ్రెస్​ పార్టీపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మంత్రి కొండా సురేఖపై కూడా ఫిర్యాదు : ఇదే ఫోన్​ ట్యాపింగ్​ అంశంలో అడ్డగోలుగా మాట్లాడారంటూ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్​ఎస్​ మరో ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె ప్రచారం చేయకుండా నిలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది.

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్‌ గాంధీ

'తుక్కుగూడ సభ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది' - ఎక్స్‌ వేదికగా రాహుల్‌ గాంధీ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.