ETV Bharat / politics

ఫోన్​ట్యాపింగ్ కేసును నీరుగారిస్తే బీఆర్ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్​కు పడుతుంది​ : ఎంపీ లక్ష్మణ్‌ - mp lAxman on phone Tapping Case - MP LAXMAN ON PHONE TAPPING CASE

MP Laxman on Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌తో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కేసీఆర్‌ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. అధిష్ఠానం ఒత్తిడితో ఫోన్‌ట్యాపింగ్‌ కేసును నీరుగార్చాలని చూస్తే బీఆర్​ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.

BJP MP Laxman on Phone Tapping Case in Telangana
MP Laxman on Phone Tapping Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 1:52 PM IST

ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌ సర్కారు ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోంది? లక్ష్మణ్‌ (ETV Bharat)

BJP MP Laxman on Phone Tapping Case in Telangana : ఫోన్‌ ట్యాపింగ్‌తో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్‌ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్‌ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారిని ఉపేక్షించవద్దని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.

MP Laxman Fires on KCR Govt Over Phone Tapping : మద్యం కేసు నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు బీజేపీ అగ్రనేతల ఫోన్లను కేసీఆర్‌ ట్యాప్‌ చేయించారని లక్ష్మణ్‌ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో దిల్లీ పెద్దలను ఇరికించడానికి ఆయన ప్రయత్నించారని అన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కాకుండా బ్రౌజింగ్​ హిస్టరీ, డేటా కాల్స్​, స్నాప్​చాట్​ వాటిని కూడా ట్రాక్​ చేశారని, ఈ తరహా చర్యలకు పాల్పడిన వారి పట్ల రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. అధిష్ఠానం ఒత్తిడితో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నీరుగార్చాలని చూస్తే బీఆర్​ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని లక్ష్మణ్‌ హెచ్చరించారు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ - ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు : బండి సంజయ్‌ - KCR Involvement in Phone Tapping

MP Laxman On Jaya Jaya He Telangana Song : మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 'జయజయహే' తెలంగాణ పాటలో మార్పులు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనా లక్ష్మణ్ మాట్లాడారు. అందెశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించిందని అన్నారు. ఈ పాటను తాము స్వాగతిస్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తామని వెల్లడించారు.

"అందెశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించింది. వారు రాసిన పాటను మేం స్వాగతిస్తాం. ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నంపై స్పందిస్తాం. కేసీఆర్ పదేళ్లపాటు అహంకారంతో పరిపాలన చేశారు. ఎక్కడికి వెళ్లినా మోదీ హవా కనిపిస్తోంది. మాకు సొంతంగా 375 సీట్లు వస్తున్నాయి. జూన్‌ 4న అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణలో రెండంకెల సీట్లు రావడం ఖాయం." - లక్ష్మణ్​, బీజేపీ ఎంపీ

ఫోన్ ట్యాపింగ్‌లో నేను, రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు బాధితులమే : బండి సంజయ్‌ - BANDI SANJAY PHONE TAPPING CASE

రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం అలా బయటపడింది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Chit Chat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.