ETV Bharat / politics

రూ.2500కే దిక్కు లేదు - రూ.లక్ష ఇస్తామంటూ మరోసారి మోసానికి తెర లేపారు : లక్ష్మణ్ - BJP MP Laxman Fires on Congress - BJP MP LAXMAN FIRES ON CONGRESS

BJP MP Laxman Fires on Congress : తుక్కుగూడ సభా వేదికగా పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచించడానికి కాంగ్రెస్‌ సరికొత్త తెరలేపిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీని ఆవిష్కరించిన ఆయన, కాంగ్రెస్​ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం గురించి హస్తం​ నేతలు మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు.

BJP MP Laxman Fires on Congress
BJP Laxman Comments on Tukkuguda Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 1:10 PM IST

Updated : Apr 7, 2024, 1:48 PM IST

BJP MP Laxman Fires on Congress : కాంగ్రెస్ పార్టీ​ హామీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు మరోమారు సిద్ధమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. తుక్కుగూడ సభ వేదికగా ఇచ్చిన హామీలను బూటకమని, పంచ న్యాయాల(Congress Paanch Nyay) పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు సరికొత్త తెరలేపిందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన గ్యారంటీలనే నెరవేర్చలేకపోయిందని ఇప్పుడు మళ్లీ గ్యారంటీలంటూ ప్రజలకు నమ్మించేందుకు యత్నిస్తున్నారన్నారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మండిపడ్డారు. బీజేపీ ఓబీసీ మోర్చా దైనందినిని ఆవిష్కరించిన లక్ష్మణ్, కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు గ్యారెంటీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. మొత్తానికి తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని పేర్కొన్నారు.

6 గ్యారంటీలు అమలు చేయకుండా - రాహుల్‌ గాంధీ తెలంగాణ ఎలా వస్తారు? : కిషన్‌ రెడ్డి - Kishan Reddy on Rahul Gandhi

"రాహుల్​ గాంధీ సమక్షంలో పంచ న్యాయాల పేరిట కాంగ్రెస్​ పార్టీ ప్రజలను వంచించేందుకు మరోసారి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదు కానీ ఇప్పుడు మళ్లీ కొత్తగా లోక్​సభ మేనిఫెస్టోలో పాంచ్​ న్యాయ్​ పేరిట ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు మరోసారి సిద్ధమయ్యారు. సామాజిక న్యాయం కోసం వారు మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది." - లక్ష్మణ్​, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

రూ.2500కే దిక్కు లేదు - రూ.లక్ష ఇస్తామంటూ మరోసారి మోసానికి తెర లేపారు : లక్ష్మణ్

బీసీలకు బద్ద వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ : నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం (Social Justice) అంతే ఉంటుందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ పేరు చెప్పి మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రమంత్రి వర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు బద్ద వ్యతిరేక పార్టీగా వివరించారు.

Kishan Reddy Challenge to Rahul Gandhi : రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్​ ఏం చేస్తోందో తెలుసుకునే స్థితిలో రాహుల్‌గాంధీ లేరని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడ సభలో (Tukkuguda Sabha) ఆయన చేసిన ప్రసంగం అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ధైర్యం ఉంటే తనతో దిల్లీ, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లలో ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు.

'ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరిపించాలి'- గవర్నర్​కు బీజేపీ నేతల ఫిర్యాదు - BJP leaders meet Governor

అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోంది: బండి సంజయ్ - BJP MP Bandi Sanjay Fires on KCR

Last Updated : Apr 7, 2024, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.