ETV Bharat / politics

షరతులు విధించకుండా పథకాలను అమలు చేయాలి- బండి సంజయ్ - Bandi Sanjay Visits Huzurabad

BJP MP Bandi Sanjay on Govt Schemes : ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. పథకాల అమలును ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం సబబు కాదని, ఇది ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోందని దుయ్యబట్టారు.

Bandi Sanjay Fires on BRS
BJP MP Bandi Sanjay on Govt Schemes
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 6:25 PM IST

షరతులు విధించకుండా ఎన్నికల హామీలను అమలు చేయాలి- బండి సంజయ్

BJP MP Bandi Sanjay on Govt Schemes : రానున్న పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్(BRS) మూడో స్థానానికే పరిమితమవుతుందని, అసలు పోటీ చేద్దామా లేదా అనే భావనలో బీఆర్ఎస్ ఉందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌(Bandi Sanjay) పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలో "గావ్‌ ఛలో అభియాన్‌" కార్యక్రమంలో భాగంగా రంగాపూర్‌లో గ్రామంలో ఆయన పర్యటించారు. చేనేత కార్మికుల పనితీరును, సాధకబాధకాలను పరిశీలించారు. వారితో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు.

Bandi Sanjay Visits Huzurabad : ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. పథకాల అమలుకు ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం, ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోందన్నారు.

Bandi Sanjay Fires on BRS : ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చని, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలని, బీఆర్ఎస్ నాయకుడు ఇష్టానుసారంగా పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. ఎన్నికలో తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు కారణాలు వెతుకుతున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌(KCR) అనే వ్యక్తి బయటకు రావటంలేదని, నిన్ననే వచ్చాడని తనకు తెలిసిందన్నారు.

"ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలి. పథకాల అమలుకు ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం, ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోంది". - బండి సంజయ్, బీజేపీ నేత

ఈ నెల 10 నుంచి బండి సంజయ్ పాదయాత్ర​

అసెంబ్లీ వేదిక ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలని, ఇరు పార్టీల బలాలు చూపెట్టుకోవటానికి ఇది వేదిక కాదని స్పష్టం చేశారు. రెండు పార్టీల బలాలు చూపెట్టుకోవాలని అనుకుంటే తమ పార్టీ తరపున హైదారాబాద్‌లో జింఖానా మైదానంలో వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. అసెంబ్లీలో సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైన చర్చ జరుగుతుందా?, జరగదా? అనేది ప్రజలు గమనించాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నియమావళి లోపల అమలు చేస్తరా, చేయరా అనేది ప్రజలు గమనించాలన్నారు.

దేశ ప్రజలందరూ మోదీ నాయకత్వాన్ని కోరుకుటుంన్నారని బండి సంజయ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 17 స్ధానాలకు గాను 17 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ అనే బీజేపీ కార్యకర్త 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాడని, తనను సంప్రదించవచ్చని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ మెడలు వంచిన ఘనత ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని అన్నారు.

కేసీఆర్​కు పదవి ఎందుకు, బార్ పెట్టుకుంటే చాలదా - కేటీఆర్​కు బండి సంజయ్ కౌంటర్

దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.