BJP MLA Maheshwar Reddy On Congress govt : గత ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలను దగ్గర పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రీ-సెటిల్మెంట్ చేసుకుంటుందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నాలుగు నెలలు గడిచినా అవినీతి పరులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం అంతర్గతంగా సెటిల్మెంట్ చేసుకుంటుందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో శిందేలు లేకపోతే మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు అభద్రతా భావంతో మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో (BJP Office) ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Maheshwar Reddy Fires On Congress : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 15 ఎకరాల భూమి హెటిరో డ్రగ్స్ పార్థసారథికి గత ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్లో ఆ భూమి విలువ రూ.1500కోట్లు- రూ.2000కోట్ల వరకు ఉంటుందన్నారు. జీవో నంబర్ 37 ద్వారా అదే భూమిని(Land) ప్రస్తుత ప్రభుత్వం హెటిరో(Hetero Drugs) డ్రగ్స్ పార్థసారథికి మళ్లీ కేటాయించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రూ.300 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
'గత ప్రభుత్వాన్ని రూ.20 వేలు డిమాండ్ చేసి - ఇప్పుడు మీరెందుకు ఇవ్వట్లేదు?' -
"దందాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం లేదు. రూ.2లక్షల కోట్ల ధరణి కుంభకోణంలో ఏమేరకు సెటిల్మెంట్ చేసుకున్నారు? రేవంత్ అంటే నా వంతు ఏంటి అంటున్నారంటా. కొంతమంది వ్యక్తులతో సూడో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో సెటిల్మెంట్ బయటపెడతా. సీఎం రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లగానే వెంకట్ రెడ్డికి భయం పట్టుకుంది"- ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
కాంగ్రెస్‌లో శిందేలు లేరు- రేవంత్ రెడ్డే పదేళ్లు సీఎం : కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఏకనాథ్ శిందేలు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు. తామంతా కలిసికట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామని చెప్పారు. బీజేపీ కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతుందని ధ్వజమెత్తారు. హరీశ్‌రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు
'ధరణి' పేరుతో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : ఏలేటి - Maheshwar Reddy on Dharani portalరాష్ట్రంలో మరో రెండు, మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి - maheshwar reddy warns on Land Grab