ETV Bharat / politics

రాష్ట్రంలో సభ్యత్వ నమోదుపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ - 50 లక్షల మెంబర్​షిప్​ టార్గెట్! - BJP MEMBERSHIP DRIVE START TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 10:25 AM IST

Updated : Sep 8, 2024, 11:17 AM IST

BJP Special Focus on Telangana : రాష్ట్రంలో సభ్యత్వ నమోదు ప్రక్రియపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి కార్యశాలలను నిర్వహించి పార్టీ శ్రేణులకు ముఖ్యనేతలు దిశానిర్దేశం చేశారు.

BJP Special Focus on Telangana
BJP Special Focus on Telangana (ETV Bharat)

BJP Membership Drive in Telangana : బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ ఈ నెల 3న చేపట్టాల్సి ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రాష్ట్ర నాయకత్వం వాయిదా వేసింది. తాజాగా నేటి నుంచి చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు సోమాజీగూడలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్​, ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంఛార్జీలు, జాతీయ నాయకులు అర్వింద్​ మీనన్​, అభయ్​ పాటిల్​ హాజరుకానున్నారు.

9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో మొదలుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ కొనసాగనుంది. ప్రతి పోలింగ్ బూత్‌లో 200 మంది సభ్యత్వాలే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఆ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేపట్టనుంది. ఈనెల 25న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రాష్ట్ర నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.

అక్టోబరు 1 నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు : పార్టీ క్రియాశీల సభ్యత్వంపైనా రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనుంది. పోలింగ్ బూత్‌లతో సంబంధం లేకుండా వంద మందితో సాధారణ సభ్యత్వాలు చేపట్టిన వారికి క్రియాశీలక సభ్యత్వం అందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదుకు మొత్తం 7 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వెల్లడించింది.

సభ్యత్వ నమోదుపై పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సంస్థాగత ఇంచార్జీ, జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌ రెండు రోజులుగా పార్టీ కమిటీలతో సమావేశం నిర్వహించారు. తొలి రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, సభ్యత్వ నమోదు జిల్లా ఇంఛార్జీలు, రెండో రోజు పార్టీకి అనుబంధంగా ఉన్న ఏడు మోర్చాలైన యువ, మహిళా, ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, కిసాన్​ మోర్చాలతో సమావేశమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నిలకు సభ్యత్వ నమోదు కీలకం : ప్రతి పోలింగ్ బూత్‌లో సభ్యత్వ నమోదు లక్ష్యాలు వివరించి, పార్టీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతోందని అన్నారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు స్వీకరించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్​ బూత్​లో సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించి, పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని మార్గనిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

రచ్చ లేపుతున్న బీజేపీ రాష్ట్ర ఇన్​ఛార్జ్ వివాదం

బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు - తెలంగాణలో నెక్స్ట్ అధికారం బీజేపీదే : కిషన్​రెడ్డి - kishan in BJP Membership Program

Last Updated : Sep 8, 2024, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.