ETV Bharat / politics

కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్, కేటీఆర్​తో దోస్తాని - ఇద్దరికి నన్ను ఓడించాలే అని ఉంటది : బండి సంజయ్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

BJP Bandi Sanjay Fires On Congress : ప్రజాసమస్యలపై కొట్లాడి, లాఠీ దెబ్బలు తిన్నది బీజేపీ నేతలైతే అప్పనంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని అనుభవిస్తుందని ఎంపీ బండిసంజయ్‌ విమర్శించారు. వేములవాడ మండలం సంకెపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు పరిస్థితిని తెలుసుకున్నారు.

BJP Bandi Sanjay On BRS
BJP Bandi Sanjay Fires On Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 3:01 PM IST

BJP Bandi Sanjay Fires On Congress : వేములవాడ అర్బన్ మండలం సంకెలపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Crop Procurement Centers in Telangana) బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలపై కొట్లాడి, లాఠీ దెబ్బ తిన్నది తమేనన్నారు. తమపై వందల కేసులు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ మెడలు వంచింది తామే అని బండి సంజయ్ అన్నారు.

దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది - తెలంగాణలోనూ వార్​ వన్​ సైడే : ధర్మపురి అర్వింద్ - Lok sabha Polls 2024

ఎలాంటి ఉద్యమాలు చేయని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ (Lok Sabha Elections 2024) పరిధిలో ఎంతమంది మహిళల అకౌంట్​లో రూ.2500 వేశారని, ఎంతమందికి ఆసరా పింఛన్ ఇచ్చారని అడిగారు. రాష్ట్రంలో ఎంతమంది రైతు భరోసా ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ చెప్పారన్నారు. ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తరుగు లేకుండా ప్రారంభించారని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీకి, కేసీఆర్, కేటీఆర్​కి లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు కేవలం బండి సంజయ్​ను ఓడించాలని ఉందని అన్నారు.

"అధికారం లేనప్పుడు ఎలాంటి పనులు చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, ఏ ఉద్యమాలు చేయకుండా, సమస్యలపై స్పందించకుండా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బాధ పడుతున్నారు ప్రజలు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం అని బాధ పడుతున్నారు. వంద రోజుల కోసం ఇచ్చిన హామీల గురించి ఈ నాయకులు ఎవరు మాట్లాడరు. వాళ్ల పార్టీ నాయకులను తిడితేనే స్పందించని నాయకులు వీరు. నామమాంత్రంగానే స్పందిస్తారు. వీళ్లందరికి కేసీఆర్, కేటీఆర్​తో దోస్తాని. వీళ్లందరికి బండి సంజయ్​ను ఓడించాలి." - బండి సంజయ్, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి

అధికారం లేక కేసీఆర్‌ కుటుంబం బతకలేకపోతోంది: బండి సంజయ్ - BJP MP Bandi Sanjay Fires on KCR

BJP Bandi Sanjay On BRS : ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ నాయకులు తిట్టినా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏమీ మాట్లడలేదన్న బండి సంజయ్ ఏం మాట్లాడిన ఇష్టారీతినా అంటారని మండిపడ్డారు. ఒకవేళ స్పందించినా నామ మాత్రంగా స్పందిస్తారని అన్నారు. కరీంనగర్​లో బండిసంజయ్ చేసిన అభివృద్ధి వారికి కనబడదు, వినపడదని ఎద్దేవా చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రభాకర్ అధికార ప్రార్టీలో ఉన్నారు కదా కావాలంటే తనపై విచారణ చేయాలని సవాల్ విసిరారు. తప్పుంటే జైల్లో వేయించాలని అన్నారు. మరోవైపు లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మేజారిటీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు. ప్రజలందరూ మోదీ చేసిన అభివృద్ధిని గుర్తుంచుకోవాలని కోరారు.

కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ కేటీఆర్​తో దోస్తాని ఇద్దరికి నన్ను ఓడించాలే అని ఉంటది బండి సంజయ్

కర్షకుల హామీలను తక్షణమే నెరవేర్చాలి - రైతుదీక్షలో బండి సంజయ్ డిమాండ్ - Bandi Sanjay raithu Diksha

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.