ETV Bharat / politics

అసెంబ్లీ - లోక్​సభ ఫలితాల్లో సేమ్ టు​ సేమ్​ - 8 స్థానాలు కైవసం చేసుకున్న కాషాయదళం - Telangana Loksabha Elections 2024 - TELANGANA LOKSABHA ELECTIONS 2024

BJP 8 Seats Won In Telangana 2024 : రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. డబుల్‌ డిజిట్‌ స్థానాలు సాధించాలనే లక్ష్యం చేరుకోకపోయినప్పటికీ, 8 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌కు దీటుగా 4 సిట్టింగ్‌ స్థానాలు నిలుపుకుని మరో నాలుగింటిలోనూ పాగా వేసింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంలో మరో అడుగు ముందుకేసింది.

BJP 8 Seats Won In Telangana Loksabha Elections 2024
BJP 8 Seats Won In Telangana 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 7:25 PM IST

Updated : Jun 4, 2024, 7:51 PM IST

BJP 8 Seats Won In Telangana Loksabha Elections 2024 : 2014లో ఒక ఎంపీ స్థానం! 2018లో నాలుగు ఎంపీ స్థానాలు! ప్రస్తుత లోక్‌సభ పోరులో బీజేపీ సాధించిన ఎంపీ స్థానాలు 8! ఈ లెక్కలు తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ ప్రభావానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణనే అధికారంలోకి వచ్చేందుకు తమ లక్ష్యంగా ఎంచుకున్న కమలనాథులు, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలుచుకున్న కాషాయదళం, ఇటీవలి అసెంబ్లీ పోరులో 8 సీట్లతో తన పట్టును మరింత పెంచుకుంది. ప్రస్తుత లోక్‌సభ సమరంలోనూ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐదు నెలల పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. జనంలో దాదాపు రెండు నెలలు ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లో పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులు, జాతీయ నాయకులను రాష్ట్రానికి వివిధ సభలు, సమావేశాలకు రప్పించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం అగ్ర నేతలతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీల అమలుపై వైఫల్యం, పదేళ్ల బీఆర్ఎస్​పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఉమ్మడి నల్గొండ ఖిల్లాలో పాగా వేసిన కాంగ్రెస్ - రెండు లోక్​సభ స్థానాల్లో విజయం - Nalgonda Lok Sabha Election Results

తెలంగాణలో బీజేపీ హవా : ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు. మూడు సార్లు రాష్ట్రానికి వచ్చి ఐదు బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ తరువాత మూడుసార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్​పై ఎదురు దాడి చేస్తూనే పదేళ్ల నరేంద్ర మోదీ పాలన, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు.

మోదీ గ్యారెంటీ, డబుల్‌ ఇంజిన్‌ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమల దండు విజయవంతమైందని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. దీనికి తోడు ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని దేశంలోని పాలనను నిర్ణయించేవని ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. బీఆర్ఎస్​కు లోక్‌సభ ఎన్నికలతో సంబంధం లేదని కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం లేదని విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం కూడా ప్రయోజనం చేకూర్చింది.

Telangana Loksabha Elections 2024 : రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎక్కువ సీట్లను సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్​పై ఉన్న వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ 39.40శాతం, బీఆర్ఎస్ 37.35శాతం, బీజేపీ 13.90శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కల్ని పరిశీలిస్తే 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీ స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిస్తే మిగిలిన అన్నిచోట్ల మూడో స్థానానికే పరిమితమైంది. దీనిని బట్టి చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టి అధికార పార్టీకి ధీటుగా సమస్థానాలను కైవసం చేసుకుంది.

మల్కాజిగిరిలో బీజేపీ జోరు - 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఈటల ముందంజ - Malkajgiri Lok Sabha Election Results 2024

కాంగ్రెస్ తొలి విజయం - ఖమ్మంలో 3.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన రఘురాంరెడ్డి - Khammam Lok Sabha Seat Winner

Last Updated : Jun 4, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.