ETV Bharat / politics

'పీవీకి భారతరత్న - తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం' - KCR Reaction On PV Bharat Ratna

Bharat Ratna PV Narasimha Rao Reactions : తెలంగాణ ముద్దుబిడ్డ, సంస్కరణల రుషి, భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం దక్కడం పట్ల రాష్ట్ర నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

PV Narasimha Rao Reactions
Bharat Ratna PV Narasimha Rao Reactions
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 3:05 PM IST

Updated : Feb 9, 2024, 3:41 PM IST

Bharat Ratna PV Narasimha Rao Reactions : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించారు. రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని తెలిపారు. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించిందని ట్వీట్ చేశారు. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రఖర జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పీవీకి భారతరత్నకు ఎంపికవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతోపాటు,రచయితగా, సాహితీవేత్తగా ప్రతి అడుగులో ఆయన జీవితం మనందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.

KCR Reaction On PV Bharat Ratna : పీవీకి భారతరత్న దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. తమ విజ్ఞప్తిని గౌరవించి ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

సంస్కరణల రుషికి భారతరత్న - అప్పుల భారతాన్ని ప్రగతివైపు నడిపిన 'పీవీ'

MP KK Reaction On PV Bharat Ratna : మరోవైపు పీవీకి భారతరత్న ఇవ్వాలని గతంలో పలుసార్లు కోరామని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారని అన్నారు. తెలంగాణ మట్టిబిడ్డ పీవీ నర్సింహరావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పీవీ సేవల్ని వాడుకున్న కాంగ్రెస్‌ ఏనాడూ ఆయన్ని గుర్తించలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు.

తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజల గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు పీవీకి భారతరత్న ప్రకటించాలని కోరిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించిందని తెలిపారు.

సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా - పీవీ ప్రస్థానం సాగిందిలా

దేశం ఆకలి తీర్చిన శాస్త్రవేత్త- హరిత విప్లవ పితామహుడికి భారత రత్న

Last Updated : Feb 9, 2024, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.