Bandi Sanjay Raithu Diksha : కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, అన్నదాతలతో కలిసి రైతు దీక్ష చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి రూ.2లక్షల రుణమాఫీ సహా, పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలు, సాగునీరు లేక ఎండిపోతున్న పంటలకు ఎకరానికి 25వేల పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి, సర్వే చేసి పంట నష్టపోయిన కర్షకులకు ఆదుకోవాలన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా చెల్లించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో తరుగుకు పాల్పడొద్దని సూచించారు. సేవ్ ఫార్మర్స్, రైతు లేనిదే రాజ్యం లేదంటూ బీజేపీ కార్యకర్తలు, రైతులు నినాదాలిచ్చారు.
Bandi on Congress Promises : కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.1300 క్వింటల్‌గా వరి మద్దతు ధరను నేడు రూ. 2300కు పెంచినట్లు తెలిపారు. పంటలు అవసరమైన ఎరువులను సైతం పెద్దమొత్తంలో సబ్సిడీ కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో మూసిసేన రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పున ప్రారంభించి యూరియా ఉత్పత్తిని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించాలి : బండి సంజయ్