ETV Bharat / politics

హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా - కాంగ్రెస్​కు బండి సంజయ్​ సవాల్ - Bandi Sanjay Challenge to Congress

Bandi Sanjay Challenge to Congress in Karimnagar :కాంగ్రెస్​ పార్టీకి కరీంనగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​ సవాల్​ విసిరారు. హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. కరీంనగర్​లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి కమలం పార్టీలోకి ఆహ్వానించారు.

Bandi Sanjay Challenge to Congress in Karimnagar

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 12:29 PM IST

Updated : Apr 27, 2024, 1:40 PM IST

Bandi Sanjay Challenge to Congress Party : రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే, పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కరీంనగర్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్​ స్పష్టం చేశారు. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. సోమవారంలోపు నిరూపిస్తే నామినేషన్​ విత్​ డ్రా చేసుకుంటానని చెప్పారు. కరీంనగర్​లోని బీజేపీ కార్యాలయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి కమలం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కాంగ్రెస్​ పార్టీకి బండి సంజయ్​ సవాల్​ విసరగా, బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్​ మోసగించిందని బండి సంజయ్​ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారన్నారు. తమ మేనిఫెస్టో ఖురాన్​, బైబిల్​, భగవద్గీత అని కాంగ్రెస్​ నేతలు చెప్పారని మండిపడ్డారు. అందులో హామీలు నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో రూ.2400 జమ చేసినట్లు నిరూపించాలని సవాల్​ విసిరారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇచ్చామని కాంగ్రెస్​ నేతలు నిరూపించాలన్నారు. విద్యార్థుల భరోసా కార్డులు ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం పార్టీ నేతలు, అందుకు తగిన ఆధారాలు చూపాలని ప్రశ్నించారు. వీటిన్నింటిని నిరూపించకపోతే 15 స్థానాల్లో కాంగ్రెస్​ పోటీ నుంచి తప్పుకుంటుందా అంటూ బండి సంజయ్​ సవాల్ విసిరారు.

"ముస్లింల కోసమే పార్టీ ఉందని కాంగ్రెస్​ ప్రచారం చేసుకుంటే, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ శ్రీ రాముడిని హేళన చేసేవిధంగా మాట్లాడుతున్నారు. వీళ్లు ఒక వర్గం ఓట్లు గురించి ఏ విధంగా కక్కుర్తి పడుతున్నారో తెలుస్తోంది. వీళ్ల గురించి ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఈరోజు మేమా మతతత్వవాదులం వాళ్లా? రుణమాఫీని ఆగస్టు 15లోగా చేస్తానని కాంగ్రెస్​ పార్టీ అన్నది. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పొలిటికల్​ డ్రామా ఆడుతున్నాయి. ఎందుకంటే మెజార్టీ సీట్లను బీజేపీ గెలుస్తుంది అందుకే ఈ డ్రామాలు అన్నీ. కాంగ్రెస్​ పార్టీ హామీలు చేసిందని నిరూపిస్తే తాను తప్పకుండా పోటీ నుంచి తప్పుకుంటాను. ఒకవేళ నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్​ పార్టీ నుంచి ప్రచారం చేస్తాను." - బండి సంజయ్​, కరీంనగర్​ ఎంపీ అభ్యర్థి

హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా - కాంగ్రెస్​కు బండి సంజయ్​ సవాల్

కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్ - BJP LEADER BANDI SANJAY NOMINATION

నేను మాట్లాడితే దేవుళ్ల పేరిట రాజకీయం - మరి మీరు వేసే ప్రమాణాల సంగతేంటి? : బండి సంజయ్ - Bandi Sanjay Fires on Revanth Reddy

Last Updated : Apr 27, 2024, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.