ETV Bharat / politics

ఎమ్మెల్యే, ఎంపీల ఝలక్​, మాట మార్చిన జగన్ - ఓడిపోయినా విచారం లేదని వెల్లడి! - ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ 2024

AP CM Jagan at India Today Education Summit: వైనాట్‌ 175 అంటూ సభల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ఏపీ సీఎం జగన్ నోటి వెంట మొదటిసారి ఓటమి మాట వచ్చింది. వరస పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్తున్న వేళ తిరుపతిలో ఓ సదస్సులో పాల్గొన్న జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నపళంగా అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చినా ఎలాంటి విచారం లేదని అన్నారు. రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని ఆరోపించారు. అంశాల వారీగా కేంద్రంలోని బీజేపీకి మద్దతిస్తున్నట్లు ఉద్ఘాటించారు.

AP_CM_Jagan_at_India_Today_Education_Summit

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 6:53 AM IST

ఎమ్మెల్యే, ఎంపీల జలక్​కు మాట మార్చిన జగన్ - ఓడిపోయిన విచారం లేదని వెల్లడి!

AP CM Jagan at India Today Education Summit : ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. "వై నాట్‌ 175 (Why Not 175) కుప్పంలో కూడా గెలుస్తున్నాం" అంటూ ఇన్నాళ్లూ మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడిలా ఒక్కసారిగా బేలగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో "ఇండియా టుడే (India Today)" విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ముఖాముఖిలో పలు ‌ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. 56 నెలల పాలనలో శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశానన్నారు. కోట్ల మంది ప్రజలకు సాయం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులు చేశామని, మ్యానిఫెస్టోలో 99 శాతం అంశాలను అమలు చేశామని వివరించారు. ఆ మ్యానిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి విశ్వాసాన్ని పొందుతున్నామని, అందుకే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

CM Jagan Said Some MLAs are not Getting Tickets: వైసీపీలో 'టికెట్లు' చిరిగాయ్​.. ఆ ఎమ్మెల్యేలకు అవకాశం లేదని తేల్చేసిన జగన్

India Today Education Summit 2024 in Tirupati : రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమన్న సీఎం ఆ గీతను కొనసాగిస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునిస్తూ వస్తున్నాం అని సీఎం చెప్పారు. అంశాలవారీ మద్దతు కేవలం బీజేపీకే పరిమితమా? కేంద్రంలో ఏ పార్టీ గెలిచినా ఇలాగే మద్దతిస్తారా? అని ప్రశ్నించగా దీన్ని ఇక్కడే వదిలేద్దాం. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అంటూ జగన్‌ దాటవేశారు.

కాంగ్రెస్‌ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని జగన్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేసినప్పుడు బాబాయ్‌ వివేకానందరెడ్డికి మంత్రి పదవిచ్చి మా పైనే పోటీకి నిలిపిందని వివరించారు. ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి తమ కుటుంబాన్ని విడదీసిందన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడన్న జగన్‌ కాంగ్రెస్‌ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్సీపీకి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు

బీజేపీ, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఉనికి లేదన్న సీఎం అన్నారు. తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన, వారితో కలిసికట్టుగా వచ్చే వారితోనే వైఎస్సార్సీపీ పోటీ అని స్పష్టం చేశారు. ఐతే గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు అభ్యర్థులను ఎందుకిలా మారుస్తున్నారని ప్రశ్నించగా ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుందని, వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందని సర్వేల్లో తేలినా కొందరు నాయకులపై జనంలో ఉన్న వ్యతిరేకత, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ఇంకో 70 నుంచి 80 రోజులే ఉన్నాయని, చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చి గందరగోళం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.

దీనివల్ల అసంతృప్తులు, గందరగోళం వంటి సమస్యలు ఎన్నికలనాటికి సమసిపోతాయన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే కేసు నమోదైందని సీఐడీ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదని వివరణ ఇచ్చారు. ఆధారాల్లేకుండా సీఐడీ కేసులు పెట్టి ఉంటే కోర్టుల్లో నిలబడవు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బీజేపీ చేతుల్లో వైసీపీ - ప్రత్యేక హోదా మర్చిపోయిన జగన్: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.