ETV Bharat / politics

కడపలో ఐదు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం - గతంలో కంటే జగన్‌కు తగ్గిన మెజారిటీ - Kadapa Election Results 2024 - KADAPA ELECTION RESULTS 2024

Kadapa Election Results 2024 : వైసీపీ​ కంచుకోటలోనూ కూటమిదే హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బద్వేలు, పులివెందులలోనే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్​ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు.

Kadapa Election Results 2024
Kadapa Election Results 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 6:35 PM IST

Kadapa Election Results 2024 : వైసీపీ అధినేత జగన్​ సొంత ఇలాకాలోనూ కూటమి హవానే కొనసాగుతోంది. మొత్తం జిల్లాలో రెండు స్థానాల్లో మినహా అన్ని సీట్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పులివెందులలో జగన్‌ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 28 వేల ఓట్ల మెజారిటీ తగ్గింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సునామీకి వైసీపీ గల్లంతైంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుచోట్ల టీడీపీ ముందంజలో ఉంది.

కౌంటింగ్​ ముగియక ముందే వెనుతిరిగిన వైసీపీ అభ్యర్థులు : 30 ఏళ్ల నవాబుల పాలనలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో పాగా వేసింది. ప్రొద్దుటూరు వైసీపీ శాసనసభలో శివప్రసాద్ రెడ్డి పదో రౌండ్ ముగియకముందే వెనుతిరిగారు. అలానే ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా తన ఓటమిని అంగీకరిస్తూ మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష కూడా 15వ రెండు లోనే మెజార్టీ తక్కువ రావడంతో ఆయన కూడా కౌంటింగ్​ పూర్తికాముందే ఇంటిబాటపట్టారు. జమ్మలమడుగు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి కూడా మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.

తెలుగుదేశం పార్టీ హవా : వైఎస్సార్ జిల్లా పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి సీఎం జగన్ ఆధిక్యంలో కొనసాగారు. కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి గెలుపొందారు. కడప వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై టీడీపీ అభ్యర్థి మాధవీ రెడ్డి విజయం సాధించారు. బద్వేల్​లో బీజేపీ అభ్యర్థి బొజ్దా రోషన్నపై వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యం కొనసాగుతుంది. జమ్మలమడుగులో వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి పైచేయి సాధించారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మైదుకూరులో వైసీపీ అభ్యర్థి ఎస్.రఘురామి రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ విజయం సాధించారు.

పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - TDP Victory in AP Elections 2024

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ - గెలుపు దిశగా నారా లోకేశ్​ - Nara Lokesh Win In Mangalagiri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.