ETV Bharat / politics

రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న బీజేపీ - దాన్ని రక్షించాలనుకుంటున్న కాంగ్రెస్​ మధ్యే ఈ ఎన్నికలు : ఖర్గే - Mallikarjun kharge on MP Elections - MALLIKARJUN KHARGE ON MP ELECTIONS

Mallikarjun kharge on BJP : ఈ లోక్​సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న బీజేపీ, దాన్ని రక్షించాలనుకుంటున్న కాంగ్రెస్​ మధ్య జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఆయన ఆత్మీయులే ధనవంతులయ్యారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించినవారు లేరుని, ఆయన అబద్ధాలకు నాయకుడని విమర్శించారు.

Mallikarjun kharge Comments on Modi
Mallikarjun kharge on BJP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:05 PM IST

Updated : May 10, 2024, 10:29 PM IST

Mallikarjun kharge Comments on Modi : ఈ లోక్​సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ, దాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్​ మధ్య జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చకూడదని అనుకుంటే కాంగ్రెస్​ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ నకిరేకల్​లో జరిగిన కాంగ్రెస్​ జనజాతర బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆత్మీయ మిత్రులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆయన తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు.

జవహర్​లాల్ నెహ్రూ కాలంలో స్థాపించిన పెద్ద సంస్థలను సైతం మోదీ తీసేశారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఎలక్టోరల్​ బాండ్ల పేరుతో చందాలు ఇచ్చిన వారికే మోదీ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్న వారిపై రూ.13వేల కోట్ల ట్యాక్స్ వేసి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మోదీ హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని వాగ్దానం పెండింగ్​లోనే ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిందని చెప్పారు.

వాగ్దానాలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ : 2024 పంద్రాగస్టు నాటికి రైతుల రుణమాఫీ చేసి తీరుతామని ఖర్గే పేర్కొన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిచి చూపిస్తామని ఉద్ఘాటించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాంచ్ న్యాయ్, 25 గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. కులగణన, జనగణన చేసి అందరికీ న్యాయం చేస్తామని, కుల గణన చేశాకే ప్రతి మహిళకు రూ. లక్ష నగదు జమ చేస్తామని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ దుకాణం బంధు అవుతుందని ఖర్గే విమర్శించారు. బీజేపీకి అంతర్గతంగా బీఆర్​ఎస్​ మద్దతు ఇస్తే ఆ పార్టీకి ఒక్క సీటూ రాదని జ్యోసం చెప్పారు. ప్రధాని మోదీ అబద్ధపు మాటలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ధైర్యం ఉంటే అదానీ, అంబానీ మీద రైడ్స్ చేయించాలని సవాల్​ విసిరారు. మోదీ అబద్ధాలు చెప్పే వారికి అబద్ధాల నాయకుడని వ్యంగ్యంగా మాట్లాడారు. వాగ్దానాలను అమలు చేయకపోవడమే మోదీ గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు.

'నల్లధనం తెస్తానన్న మోదీ ప్రజలకు ఇచ్చారా ? రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఇచ్చారా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చేశారా? మోదీకి తెలంగాణలో ఒక్క సీటు వచ్చినా రాజ్యాంగం అభద్రతలో పడుతుంది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. ప్రాథమిక హక్కులు హరించుకుపోతాయి.' - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు

రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న బీజేపీ - దాన్ని రక్షించాలనుకుంటున్న కాంగ్రెస్​ మధ్యే ఈ ఎన్నికలు : ఖర్గే (ETV Bharat)

మేమంటే భయం అందుకే పదేపదే విమర్శలు - టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే మీరేం చేస్తున్నారు? : ఖర్గే - KHARGE SLAMS BJP COMMENTS

Last Updated : May 10, 2024, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.