ETV Bharat / opinion

పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలు - వాటిని ఎదుర్కొనే మార్గాలు ఇవే!! - Cyber Crime Safety Measures - CYBER CRIME SAFETY MEASURES

Cyber Crimes Safety Tips : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెచ్చరిల్లుతున్నాయి. వివిధ రకాలుగా నేరాలకు తెరలేపి అమాయకపు ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారు. ప్రజలకు అవగాహన మేరకు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. అయితే వీటిని ఎలా ఎదుర్కొవాలి. అపరిచితుల నుంచి కాల్స్​ వస్తే ఎలా స్పందించాలి? నేరానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిధ్వని.

Cyber Crimes Safety Tips
Safety Measures Of Cyber Crimes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 9:53 AM IST

Safety Measures Of Cyber Crimes : సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ప్రముఖవ్యక్తుల సోషల్‌ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు అపరిచతుల మ్యూల్‌ ఖాతాలకు బదిలీ అవుతున్నాయి. కొరియర్‌ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ బెదిరించి, డబ్బులు గుంజుతున్నారు. అయితే సైబర్‌ నేరస్థులు సొమ్ములు కొట్టేసినా, భయపడకుండా సత్వరమే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు వెనక్కి తీసుకొస్తోంది సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో.

ఈ నేపథ్యంలో రోజుకో కొత్తరూపంలో వల విసురుతున్న సైబర్‌ నేరస్తుల ఉచ్చు నుంచి ఎలా తప్పించుకోవాలి? పోలీసులమని, ఈడీ అని, సీబీఐ అని, కస్టమ్స్ అధికారులమని ఫోన్‌ చేసి ఎవరైనా బెదిరిస్తే ఏం చేయాలి? నిజమైన అధికారులకు కేటుగాళ్లకు తేడా తెలుసుకోవడం ఎలా? సాధారణంగా ఏదైనా నేరం జరిగితే పోలీసుల్ని ఆశ్రయిస్తాం. కానీ ఇటీవల చాలా సైబర్ నేరాలు పోలీసుల పేరుతో బెదిరింపుల ద్వారా మొదలవుతున్నాయి. దీన్నెలా ఎదుర్కోవడం? బాధితులు నష్టపోతున్న మొత్తం వేల నుంచి లక్షలు, కోట్లకు చేరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మోసపోయామని గుర్తించాక ఫిర్యాదు చేయడానికి ఉన్న మార్గాలు ఏమిటి? కేసులు, డ్రగ్స్‌ పేరుతో బెదిరించే కేటుగాళ్లను ఎలా గుర్తించాలి? చేజారిన డబ్బులు తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదే నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.