Prathidhwani Debate on World war : ప్రపంచాన్ని మొత్తాన్ని యుద్ధమేఘాలు వణికిస్తున్నాయి. దేశాలకు దేశాల మధ్య, దేశాల్లోనే అంతర్గతంగా రేగిన ఘర్షణలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ చూసినా. అంతుదరీ లేని అంతర్యుద్ధాలు, కీలకదేశాల మధ్య రగిలిన పోరాటాలు రావణకాష్టాల్లా రగులుతునే ఉన్నాయి. ఐరోపా, పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత సరిహద్దు దేశాల వరకు అదే పరిస్థితి. ఇప్పుడా జాబితాలో మన పొరుగుదేశం బంగ్లాదేశ్ కూడా చేరింది. స్వల్ప వ్యవధిలో అక్కడ దావానలంలా వ్యాపించిన అల్లర్లతో ప్రభుత్వమే కూలిపోయింది. ఈ పరిణామాలన్నీ దిల్లీ నాయత్వానికి పెడుతున్న పరీక్షలు ఏమిటి? దౌత్యపరంగా, వాణిజ్యపరంగా, భద్రత పరంగా ఇవి విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Bangladesh Crisis : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం భారత్‌కు సవాలుగా మారింది. సుమారు 15 ఏళ్లుగా భారత్‌కు స్నేహహస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది. విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ-బీఎన్పీ, జమాత్-ఇ-ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటుచేస్తే భారత్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.