Prathidhwani Debate On Engineering Courses : తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ సంవత్సరం బీటెక్ సీట్లు తగ్గాయి. సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా, కన్వీనర్ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఇంజినీరింగ్ విద్య ప్రధాన గమ్యస్థానంగా ఉంది. ప్రస్తుతం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లో చేరేందుకు సమాయత్తమవుతున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.
ఇంజినీర్ కోర్సులకు దీర్ఘకాలికంగా మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులకు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యలో ప్రస్తుతం ఏఏ కోర్సులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి? ఏ కోర్సు ఎంచుకుంటే మంచి ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవచ్చు? మైనర్ డిగ్రీల పరిచయంతో ఇంజినీరింగ్ విద్యలో ప్రాధాన్యాలు పెరగనున్న కోర్సులు ఏవి? ఇదే నేటి ప్రతిధ్వని.