ETV Bharat / opinion

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కాంగ్రెస్​కు సాధ్యమేనా? హస్తం​ పార్టీకి ఉన్న బలాబలాలేంటి?

Analysis On Congress Victory Chances In Lok Sabha Polls 2024 : వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతోంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని కాంగ్రెస్​ పార్టీ మోదీ చరిష్మాను కాదని 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడం సాధ్యమేనా? అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమిని పార్టీ అధిగమించగలదా? రానున్న లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ముందున్న సవాళ్లేంటి? కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Lok Sabha Polls 2024 Congress Party Winning Chances

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 3:16 PM IST

Analysis On Congress Victory Chances In Lok Sabha Polls 2024 : పదేళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్​ పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిపోవడం వల్ల దేశవ్యాప్తంగా పార్టీ రాజకీయ ప్రతిష్ఠ గణనీయంగా దెబ్బతింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ శక్తివంతంగా మారడం వల్ల పార్టీ ప్రతిష్ఠ, మనుగడ కోసం పోరాడుతున్న కాంగ్రెస్​ పార్టీ రానున్న ఎన్నికల్లో కఠిన పోటీని ఎదుర్కోనుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి గత దశాబ్దం వరకు దేశ రాజకీయాల మీద ఆధిపత్యం చలాయించిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్, తెలంగాణ కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్​ పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. అటువంటిది రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియాకు కాంగ్రెస్​ నాయకత్వం వహించడం ప్రశ్నార్ధకమే.

డిపాజిట్లు కోల్పోతున్న అభ్యర్థులు
138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్​ పార్టీ మోదీ పాలనతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. లోక్​సభలో ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి అవసరమైన మొత్తం బలంలో 10 శాతం సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. వారసత్వ కుటుంబ రాజకీయాలకు కేరాఫ్​గా మారిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 421 సీట్లకు గాను కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2014లో పోటీచేసిన 464 స్థానాలకు గాను కేవలం 44 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. 2014లో 178 మంది కాంగ్రెస్​ అభ్యర్థులు, 2019లో 148 మంది నేతలు డిపాజిట్​ కోల్పోయారు.

కాంగ్రెస్​ సీట్ల సరళి
1984లో రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్​ పార్టీ 1989 సార్వత్రిక ఎన్నికల్లో దాని లోక్​సభ బలం 197 స్థానాలకు పడిపోయింది. 1991లో 232, 1996లో 140, 1999లో 114, 2004లో 145, 2009లో 209 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 20 ఏళ్ల తరువాత 200 స్థానాలను దాటింది. 2014, 2019లో ప్రతిపక్ష హోదాను కూడా సాధించుకోలేక కొట్టుమిట్టాడుతోంది.

2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర ఓటమిపాలైనప్పటికీ పార్టీకి ఉన్న 19 శాతం ఓట్​ షేర్​ను కొనసాగించడం ఒక్కటే కాస్త ఆశాజనకమైన అంశం. ఇప్పుడు దానిని పెంచుకోవాలని భావిస్తోంది. 2009లో మన్మోహన్​ సింగ్ అధికారంలోకి వచ్చాక 28 శాతం ఓట్లు సాధించారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపోటములను నిశ్చయించేది ఆ పార్టీ బలాలు, బలహీనతలే. ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి ఉన్న అవకాశాలు, పొంచి ఉన్న ముప్పుపై ఒకసారి విశ్లేషణ చేద్దాం.

కాంగ్రెస్​ బలాలు

  • వందేళ్ల రాజకీయ అనుభవం కలిగి ఉన్న కాంగ్రెస్​ పార్టీ షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగలు, ఓబీసీలు, మైనారిటీల సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగి ఉంది. లౌకిక, అందరిని కలుపుకుని పోయే విధంగా పాన్​ ఇండియా పార్టీగా తనను తాను ప్రొజెక్ట్​ చేసుకుంటూనే ఉంది. రానున్న ఎన్నికల్లో కులగణన అంశంతో పాటు, అతిపెద్ద ఓటర్లు కలిగిన ఓబీసీలను ఆకర్షించాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది.
  • పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, యువత, మహిళలు అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్​ పార్టీ తన హామీలను ప్రకటించింది. భారతదేశానికి సాధికారిత కల్పించడానికి 5 హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. యువ న్యాయ్​, నారీ న్యాయ్​, కిసాన్​ న్యాయ్​, శ్రామిక్​ న్యాయ్​ ఇలా పలు అంశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్​ పార్టీ.
  • క్యాడర్​, లీడర్లు ఉండడం వల్ల కాంగ్రెస్​ పార్టీకి ప్రస్తుతానికి ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంత ఉనికి ఉంది. ప్రజల సమస్యలపై కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యం లాంటి అంశాల మీద కాంగ్రెస్​ పార్టీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల పోలింగ్​లో ప్రభావం చూపించే యువ ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్​ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్​ బలహీనతలు

  • మహాత్మా గాంధీ, జవహర్​ లాల్​ నెహ్రూ, సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​, లాల్​ బహదూర్​ శాస్త్రి, శ్యామా ప్రసాద్​ ముఖర్జీ లాంటి మహానుభావులు తమ పార్టీకి గొప్ప నాయకత్వం అందించారని ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్​ పార్టీకి ప్రస్తుతం అలాంటి నాయకత్వం కరువైంది. నాయకత్వ లేమితో క్యాడర్​, లీడర్లు బలహీన పడ్డారు. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర ద్వారా పార్టీలో జోష్​ నింపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలతో అనుసంధానం కాలేకపోయారని పార్టీ అగ్రనేతలు పదేపదే అంటున్నారు.
  • ఎన్నికల్లో పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోకపోవడం, ఒకప్పటి కాంగ్రెస్​ పార్టీ విధేయులు అనేక మంది ఇతర పార్టీలకు వెళ్లిపోవడం ఆ పార్టీకి తీరని లోటు.
  • ప్రజల సమస్యల పట్ల కాంగ్రెస్​ పార్టీ వైఖరి అప్పుడప్పుడు తీవ్ర విమర్శల పాలవుతుంది. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయం ఆ పార్టీ వర్గాల్లో దిగ్భ్రాంతికి దారితీసింది. ట్రిపుల్​ తలాక్​ చట్టాన్ని నేరంగా పరిగణించడం, సీఏఏ అమలు, ఆర్టికల్​ 370 రద్దుపై పార్టీ వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
  • పార్టీని వీడుతున్న చాలామంది నేతలు కాంగ్రెస్​ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. గత చరిత్ర గురించి చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్​ పార్టీలో ఇప్పటి తరానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలు, మార్పులు జరగడం లేదని విమర్శిస్తున్నారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులతో సాగిన యూపీఏ దశాబ్ద పాలన మీద ఉన్న వ్యతిరేకతను బీజేపీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతోంది.

కాంగ్రెస్​ అవకాశాలు

  • ఎలక్ట్రోరల్​ బాండ్​లపై తాజాగా భారత ఎన్నికల సంఘం వెల్లడిని దోపిడీ రాకెట్​గా కొట్టిపారేయడమే కాకుండా, ఇటీవల రాహుల్​ గాంధీ రెండు భారత్​ జోడో యాత్రల నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
  • హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక, తెలంగాణలో విజయాలు, బీజేపీ దశాబ్ద కాలంపాటు అధికారంలో ఉండి చేసిన వైఫల్యాలను ఎండగడుతూ ఉచిత పథకాలను అందించడం ద్వారా కాంగ్రెస్​ పార్టీ ఈసారి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
  • బీజేపీకి వ్యతిరేకంగా భారత కూటమిలో ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత కాంగ్రెస్​ పార్టీకి సవాలుగానూ, అవకాశంగానూ మారింది.

కాంగ్రెస్​కు పొంచి ఉన్న ముప్పు

  • ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, బీజేపీ పాలనలో భారత్​ సాధించిన అభివృద్ధి కాంగ్రెస్​ పార్టీని తీవ్రంగా దెబ్బతీయవచ్చు. వరుస ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంటోంది. 1984లో ఇద్దరు ఎంపీల నుంచి 2019లో 303కి పెరిగి, ఇప్పుడు 370 సీట్లను గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
  • కాంగ్రెస్​ పార్టీకి ఉన్న అతి పెద్ద ముప్పు ఏంటంటే స్థిరమైన నాయకులు లేకపోవడం, వలసలు, అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అంతర్గత కలహాలు, సరైన నాయకత్వం లేకపోవడం, ఇప్పటికీ గాంధీ కుటుంబమే నాయకత్వం వహిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్​ ఖర్గే ఉన్నప్పటికీ పార్టీ మీద ఆయనకు పట్టు లేదనే గుసగుసలు కాంగ్రెస్​కు ముప్పే.
  • కాంగ్రెస్​ పార్టీ అనేక రాష్ట్రాల్లో కలిసి పోటీచేస్తున్నా ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాడాల్సి ఉంటుంది. ఇది భారత కూటమి ఐక్యతను దెబ్బతీస్తూ ప్రతిపక్ష ఓటు బ్యాంకును విభజిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి నుంచి ఒక్క అభ్యర్థినే నిలబెట్టడంలో భారత కూటమి విఫలం కావడమే ఎన్నికల అవకాశాలను ప్రభావితం చేస్తుంది.

టార్గెట్‌ 400- NDA త్రిశూల వ్యూహం- వీటిపైనే ఫోకస్​!

మోదీ గ్యారంటీ Vs కాంగ్రెస్ న్యాయ్ గ్యారెంటీ- 2024 యుద్ధం షురూ- టాప్ 10 ప్రచార అస్త్రాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.