ETV Bharat / offbeat

చదువు మధ్యలో ఆపేసి.. యూట్యూబ్​ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది! - ఇంతకీ ఏం చేస్తోందో తెలుసా?

- టాలెంట్ ఉంటే చాలు.. డబ్బు సంపాదించడం ఈజీ అంటున్న మహిళ

Amy Landino
Youtube Creator Amy Landino (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Youtube Creator Amy Landino : చాలా మంది మంచి కాలేజీలో గొప్ప చదువులు చదివితేనే.. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని అనుకుంటారు. కానీ, మన దగ్గర టాలెంట్​ ఉంటే ఏ డిగ్రీలు లేకుండానే నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చని నిరూపిస్తోంది ఓ మహిళ. ఇంతకీ ఆమె ఎవరు ? యూట్యూబ్​లో ఏ కంటెంట్​ వీడియోలను అప్​లోడ్​ చేసి డబ్బులు సంపాదిస్తోంది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

న్యూయార్క్‌కి చెందిన ఈమె పేరు అమీ ల్యాండినో (AMY LANDINO). ఒకానొక టైమ్​లో ఫీజు కట్టలేక కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసింది. తర్వాత ప్రొడక్టివిటీ కోచ్‌గా మారింది. వ్యాపార వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల్ని వీడియోల రూపంలో అందించడం స్టార్ట్​ చేసింది. ప్రస్తుతం ఓ కంటెంట్‌ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా రాణిస్తోంది. తనలో ఉన్న స్కిల్స్​ని కెరీర్‌గా మార్చుకొని ఏడాది తిరిగే సరికి కోట్లు సంపాదిస్తోంది.

AMY LANDINO
AMY LANDINO (ETV Bharat)

విద్యా రుణం చెల్లించలేక!

అమీ ల్యాండినోది చిన్నతనం నుంచి ముక్కుసూటి వ్యక్తిత్వం. తన వల్ల అయ్యే పనులే చేస్తుంది. అంతేకానీ మొహమాటానికి పోయి తన సామర్థ్యానికి మించిన పనులు నెత్తినేసుకొని ఒత్తిడికి లోనవదు. అమీది మధ్య తరగతి కుటుంబం. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక అమీ కాలేజీలో చేరింది. ఆమె పైచదువుల కోసం తండ్రి విద్యా రుణం తీసుకున్నాడు. అయితే ఇది అమీ ల్యాండినోకు భారంగా అనిపించింది. ఇలా ఓవైపు తన తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మరోవైపు ఆ టైమ్​లో ఉద్యోగ సంక్షోభం ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీ చదువుకు గుడ్‌బై చెప్పింది అమీ.

అటు ఉద్యోగం.. ఇటు వీడియోలు!

అమీ తొలుత ఓ సంస్థలో పబ్లిక్‌ పాలసీ అసిస్టెంట్‌గా చేరింది. అక్కడ చిన్న స్థాయి వ్యాపారులకు సోషల్‌ మీడియా ఖాతాలపై అవగాహన కల్పిస్తూ.. వాటిని ఎలా మేనేజ్‌ చేయాలో వివరించేది. మరోవైపు ఇదే కంటెంట్‌ని వీడియోలుగా రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసేది. ఇవి చూసిన తన స్నేహితులు ఆమీని ప్రశంసించేవారు.

ఓ స్నేహితురాలు 'నువ్వు కంటెంట్‌ క్రియేటర్‌గా ఎందుకు మారకూడదు?' అని ప్రశ్నించింది. దీంతో కొంత కాలం తర్వాత ఆమె చేస్తున్న ఉద్యోగం మానేసి.. పూర్తిగా యూట్యూబ్‌లో వీడియోలు అప్​లోడ్​ చేయడంపై ఫోకస్​ పెట్టింది. రోజురోజుకీ తన వీడియోలకు ప్రేక్షకాదరణ లభించడంతో పాటు, సబ్‌స్క్రైబర్ల సంఖ్యా పెరిగింది.

ఓ ఆన్‌లైన్‌ కోర్సు కూడా..

వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తులు, మార్కెటింగ్‌, సేల్స్‌.. వంటి అంశాల్లో తమ సొంత వీడియోలు ఎలా రూపొందించుకోవాలో నేర్పించడం కోసం .. ఆమీ ఓ ఆన్‌లైన్‌ కోర్సును రూపొందించింది. దీనిద్వారా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో నేర్చుకోవచ్చు.

ఇన్ని విధాలుగా డబ్బు సంపాదన..

అమీ ల్యాండినో యూట్యూబ్‌ ఛానల్‌ పేరు 'AmyTV'. ఈమె ఇప్పటికే 1200లకు పైగా వీడియోల్ని తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు దాదాపు 4.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. యూట్యూబర్‌గా.. మరోవైపు యూట్యూబ్‌ యాడ్స్‌, అఫ్లియేట్‌ మార్కెటింగ్‌, బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, ప్రొడక్ట్‌ సేల్స్‌.. వంటి మార్గాల ద్వారా నెలకు దాదాపు రూ. 15 లక్షలు సంపాదిస్తోంది అమీ. తన భర్తతో కలిసి 'Aftermarq' అనే వీడియో మార్కెటింగ్‌ కంపెనినీ కూడా నడుపుతోంది.

ఇవి కూడా చదవండి :

మా మంచి మాస్టారూ - సేవ చేయడంలో ఈయన నిజంగా 'దయగలప్రభువే'

'టీచరమ్మా - నువ్వు సూపరమ్మా' - ప్రభుత్వ బడికి ప్రాణం పోసి - 83 మంది భవితకు బాటలు వేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.