ETV Bharat / offbeat

అన్నం, రోటీ, బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ - నోరూరించే "టమాటా మసాలా కర్రీ" - ఈజీగా చేసుకోండిలా! - TOMATO MASALA CURRY

టమాటా మసాలా కర్రీ ఓసారి ఇలా ట్రై చేయండి - రైస్, చపాతీ, బిర్యానీ, పులావ్​ దేనిలోకైనా కాంబినేషన్ అదుర్స్!

How to Make Tomato Masala Curry
Tomato Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 9:59 PM IST

How to Make Tomato Masala Curry : సాధారణంగా ఇంట్లో టమాటాలు ఉన్నాయంటే.. ఇతర కూరగాయలతో కలిపి వండేస్తుంటాం. లేదంటే పప్పూ /పచ్చడీ చేస్తాం. అవేవీ కాకుండా ఈసారి ఇలా "టమాటా మసాలా కర్రీ"ని ట్రై చేయండి. ఇది సూపర్ టేస్టీగా ఉండడమే కాకుండా అన్నం, రోటీ, చపాతీ, పులావ్, బిర్యానీ.. దేనికైనా మంచి కాంబినేషన్ అవుతుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా సులువు! ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుకొబ్బరి ముక్కలు - 1 టేబుల్​స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • లవంగాలు - 4
  • దాల్చిన చెక్క - 2 అంగుళం ముక్కలు
  • యాలకులు - 3
  • జీలకర్ర - అరటీస్పూన్
  • మెంతులు - చిటికెడు
  • మిరియాలు - అరటీస్పూన్
  • నువ్వులు - 1 టేబుల్​స్పూన్
  • కసూరి మేతి - 1 టీస్పూన్
  • ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్​వి)
  • పండిన టమాటాలు - 4
  • ఆయిల్ - తగినంత
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్​స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - తగినంత
  • పచ్చిమిర్చి - 3
  • చింతపండు - చిన్న నిమ్మకాయంత
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలను వీలైనంత సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే టమాటాలను తొడిమె వైపు కాస్త కట్ చేసి ఫోర్క్​తో గుజ్జు కర్రీలోకి దిగేలా పైభాగంలో అక్కడక్కడ గుచ్చి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, నువ్వులు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గరిటెతో కలుపుతూ అన్నింటినీ దోరగా ఫ్రై వేయించుకోవాలి. ఇక దింపే ముందు కసూరి మేతి వేసి ఒకసారి అలా వేయించి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లో వేయించుకున్న పల్లీల మిశ్రమాన్ని తీసుకొని ముందు పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో కాసిన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి.
  • ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్​ని వేసుకొని కలిపి మిశ్రమంలో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయిందనుకున్నాక.. పసుపు, కారం, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు వేసి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకొని మరోసారి కలియతిప్పుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో టమాటాలు, చింతపండు రసం యాడ్ చేసుకొని కలిపి ఉప్పు, కారం సరిపోయాయా, లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత పాన్​పై మూత పెట్టి మీడియం ప్లేమ్ మీద ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇక చివరగా గ్రెవీ కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టౌ ఆఫ్ చేసుకొని కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "టమాటా మసాలా కర్రీ" మీ ముందు ఉంటుంది!

ఇవీ చదవండి :

ఎప్పుడైనా "టమాటా బజ్జీలు" తిన్నారా? - ఇలా ఓసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి!

అద్దిరిపోయే 'టమాటా నిల్వ పచ్చడి' - ఇలా చేస్తే సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.