ETV Bharat / offbeat

వింటర్​ స్పెషల్​​ : ఘుమఘుమలాడే "టమాటా కొత్తమీర సూప్​" - వేడివేడిగా గొంతులోకి జారుతుంటే అదుర్స్! - HOW TO MAKE TOMATO CORIANDER SOUP

- చలి నుంచి తట్టుకునేందుకు రుచికరమైన సూప్​ ఇది - ఇలా ప్రిపేర్​ చేస్తే నిమిషాల్లో రెడీ

How to Make Tomato Dhania Shorba
How to Make Tomato Dhania Shorba (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 10:46 AM IST

How to Make Tomato Dhania Shorba: తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. పగలు మొత్తం ఎండ ఉన్నా.. సాయంత్రమైతే చాలు మంచు కురుస్తుంది. ఇక ఈ చలికాలంలో ఏం తిన్నా, తాగినా వేడివేడిగా ఉండేలా చూసుకుంటాం. ముఖ్యంగా ఎక్కువ శాతం వేడివేడి రసాలు, సూప్​లు ఉండేలా చేస్తుంటారు మహిళలు. అయితే.. మనకు సూప్​లు ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో టమాటా కొత్తిమీర సూప్​ ఒకటి. ఈ సూప్​ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కొద్దిమందికి ఈ సూప్​ చేయడం రాదు.. ఒకవేళ చేసినా పల్చగా తయారవుతుంటుంది. దీంతో.. చేసేది లేక బయటి నుంచి ఇన్​స్టంట్​ సూప్​ పొడులు తెచ్చుకుని ప్రిపేర్​ చేసుకుంటుంటారు. అలాంటి వారు ఈ స్టోరీలో చెప్పే టిప్స్​, కొలతలు పాటిస్తూ చేస్తే ఈ సూప్​ రుచి అద్దిరిపోతుంది. పైగా నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి అలా నోరూరిస్తూ చలిని దూరం చేసే ఈ హెల్దీ సూప్​ని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • నెయ్యి లేదా బటర్​ - అర టీ స్పూన్​
  • నూనె - 1 టీ స్పూన్​
  • దంచిన వెల్లుల్లి - 3
  • దంచిన అల్లం - అర ఇంచ్​
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • యాలకులు - 3
  • లవంగాలు - 2
  • బిర్యానీ ఆకు - 1
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • గోధుమ పిండి - 1 టీ స్పూన్​
  • టమాట - పావు కిలో
  • కొత్తిమీర - 100 గ్రాములు
  • కారం - అర చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 2
  • వాటర్​ - అర లీటర్​

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి లేదా బటర్​, నూనె వేసుకోవాలి.
  • ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, దంచిన అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత గోధుమపిండి వేసి మంటను సిమ్​లో పెట్టి మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి ఓ నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను శుభ్రంగా కడిగి కాడలతో సహా వేసుకోవాలి. ఆ తర్వాత అర చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
  • అనంతరం పచ్చిమిర్చిని తుంచి వేసుకుని మూత పెట్టి మంటను సిమ్​లో పెట్టి టమాటలు గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • టమాటా ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత అందులోకి అరలీటర్​ నీళ్లు పోసుకుని సిమ్​లో పెట్టి నిధానంగా మరగనివ్వాలి.
  • లో-ఫ్లేమ్​ మీద ఈ సూప్​ చేసుకుంటే రుచి బాగుంటుంది. నీళ్లు సగానికి అయ్యేవరకు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత ఓ జెల్లెడలో ఈ మిశ్రమాన్ని వేసి వడకట్టాలి. టమాటా ముక్కల్లోని సారం అంతా సూప్​లోకి జారాలే గరిటెతో మెత్తగా మెదుపుతూ సూప్​ను వడకట్టాలి.
  • అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర సూప్​ రెడీ. దీనిపైన కాస్త కొత్తిమీర చల్లి సర్వ్​ చేసుకుని వేడివేడిగా తాగుతుంటే ఉంటుంది.. ఆ ఫీలింగ్​ చెప్పలేమంటే నమ్మండి. అంత బాగుంటుంది. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

అద్దిరిపోయే "రాగి సూప్"​​- ఇలా చేస్తే సూపర్ టేస్ట్! పైగా ఆరోగ్యం బోనస్​!​

చల్లని చిరుజల్లుల వేళ - ఇలా "చికెన్ సూప్" చేసుకొని సిప్ చేయండి - జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.