How to Make Tasty Egg 65: చాలా మంది ఈవెనింగ్ టైమ్‌లో ఓ కప్పు వేడి వేడి టీతో పాటు ఏమైనా స్నాక్స్ తినాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈవెనింగ్ స్నాక్స్ అంటే అందరికీ సమోసా, పకోడి, మిక్చర్ వంటివి గుర్తొస్తుంటాయి. అయితే ఇవి మాత్రమే కాదు సాయంత్రం స్నాక్స్‌గా ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చు. అందులో ఎగ్ 65 కూడా ఒకటి. ఈ రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ. అయితే చాలా మంది దీనిని చేయాలంటే సాస్‌లు కావాలని అనుకుంటారు. కానీ అవేమి లేకుండా ఎంతో రుచికరంగా కేవలం నిమిషాల్లోనే ఎగ్ 65 ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
కోటింగ్ కోసం
- ఉడికించిన గుడ్లు - 4
- ఉప్పు - అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- కారం- 1 టీస్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
- మైదా - 3 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్
65 కోసం:
- నూనె- 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి సన్నని తరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 2
- ఎండుమిర్చి - 2
- ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 2 రెబ్బలు
- గరం మసాలా- అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- వేయించిన ధనియాల పొడి - అర టీ స్పూన్
- కారం - ముప్పావు టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చిలికిన పెరుగు - 1 కప్పు
- ఫుడ్ కలర్- చిటికెడు
- అజినోమోటో పొడి - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - అర చెక్క
తయారీ విధానం:
- ముందుగా ఉడికించిన గుడ్లు తీసుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పొడుగ్గా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు కోటింగ్ కోసం.. ఓ బౌల్లోకి ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కార్న్‌ఫ్లోర్, మైదా వేసి కలపాలి. ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి మాదిరి కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి కోటింగ్ ఊడిపోకుండా నూనెలో వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి హై ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయ మెత్తబడ్డాక గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- అనంతరం బాగా చిలికిన పెరుగు వేసి మంటను తగ్గించి పెరుగు మసాలాలకు పట్టేలా స్పీడ్‌గా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ఫుడ్ కలర్ వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత అజినోమోటో వేసుకోవాలి.
- మరో హై ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్ల ముక్కలు వేసుకుని టాస్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి మరోసారి టాస్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ 65 రెడీ.
గుంటూర్ స్పెషల్ "కోవా మాల్పూరి" - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్- పైగా రుచి అద్భుతం!