ETV Bharat / offbeat

మీ ఇంట్లో 'దొండకాయ' తినట్లేదా? - ఓసారి ఇలా చేసి పెట్టండి! - అందరికీ నచ్చేస్తుంది! - DONDAKAYA NIMMA KARAM RECIPE

దొండకాయలతో ఎప్పుడూ రొటీన్ కర్రీలే కాదు - ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి!

How to Make Dondakaya Nimmakaya Karam
Dondakaya Nimmakaya Karam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 5:06 PM IST

Dondakaya Nimmakaya Karam Recipe : కొందరు దొండకాయ కర్రీని ఎంతో ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నం, చపాతీల్లోకి దొండకాయ ఫ్రై, కర్రీ ఏదైనా సూపర్ అంటూ లాగిస్తారు. కొంతమంది మాత్రం అందుకు పూర్తి భిన్నం. దొండకాయ కర్రీ ఎంత బాగున్నా కూడా అసలు దగ్గరికే రానివ్వరు. మీ ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటే ఓసారి ఇలా "దొండకాయ నిమ్మకారం" చేసి పెట్టండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! తినని వారూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు. పైగా దీన్ని చేసుకోవడం చాలా సులువు! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు - 350 గ్రాములు
  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • పల్లీలు - 3 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అరటీస్పూన్
  • శనగపప్పు - అరటేబుల్​స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావుటీస్పూన్
  • ఇంగువ - చిటికెడు

నిమ్మకారం పేస్ట్ కోసం :

  • మెంతులు - పావుటీస్పూన్
  • ఆవాలు - 1 టీస్పూన్
  • ధనియాలు - అరటేబుల్​స్పూన్
  • జీలకర్ర - అరటేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • కారం - తగినంత
  • ఒకటిన్నర నుంచి రెండు నిమ్మకాయల రసం
  • బెల్లం/పంచదార - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా

క్యాటరింగ్ స్టైల్లో "దొండకాయ ఫ్రై" - ముద్ద మిగల్చకుండా తినేస్తారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా లేత దొండకాయలను శుభ్రంగా కడిగి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై ఆ ముక్కలను స్టీమర్​లో ఉంచి మెత్తగా మగ్గించుకోవాలి. అందుకోసం 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
  • ఒకవేళ మీకు స్టీమర్ లేకపోతే మామూలుగా ఫ్రెషర్ కుక్కర్​లో దొండకాయ ముక్కలు వేసి కాసిన్ని వాటర్ పోసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ వడకట్టి వాడుకుంటే సరిపోతుంది.
  • ఆలోపు నిమ్మకారం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని మెంతులు రంగు మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక చిన్న మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కారం, బెల్లం/చక్కెర, ఉప్పు వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి.
  • అలాగే కారాలు మాడిపోకుండా 2 టేబుల్​స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా గరిటెతో బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కుక్ చేసుకుంటున్న దొండకాయలు 70శాతం వరకు ఉడికితే స్టౌ ఆఫ్ చేసి దింపి పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం స్టౌపై మరో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
  • అనంతరం మిగిలిన నూనెలో ఆవాలు, శనగపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగిందనుకున్నాక ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పసుపు, ఇంగువ వేసి కలిపి ముక్కల్లో నుంచి నీరు ఇగిరి లైట్ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందుకోసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా కలిపి ఉంచుకున్న నిమ్మకారం పేస్ట్​ని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పల్లీలను యాడ్ చేసుకొని కలిపి దింపేసుకోవాలి.
  • అనంతరం వెంటనే సర్వ్ చేసుకోకుండా అరగంట పాటు ఆగి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "గుంటూరు స్టైల్ దొండకాయ నిమ్మ కారం" రెసిపీ రెడీ!

నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.