These Foods Should Avoid Pairing With Lemon : నిమ్మకాయలో పుష్కలంగా ఉండే విటిమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు.. బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకు ఎంతగానో సహాయపడతాయి. అందుకే.. చాలా మంది నిమ్మను వివిధ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే, నిమ్మకాయతో(Lemon) ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. దానిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ, నిమ్మరసంతో కలిపి తీసుకోకూడని ఆ ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలు, పాల సంబంధిత ఉత్పత్తులు : నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, పాలు లేదా ఇతర పాల సంబంధిత ఉత్పత్తులను లెమన్‌తో కలిపి తీసుకుంటే పొట్టలో యాసిడిక్ రియాక్షన్ తలెత్తుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల గుండెల్లో తీవ్రమైన మంట, ఆమ్లత్వం ఏర్పడవచ్చంటున్నారు.
స్పైసీ ఫుడ్స్ : చాలా మందికి స్పైసీ ఫుడ్స్ తినేటప్పుడు నిమ్మకాయ పిండుకునే అలవాటు ఉంటుంది. కానీ, స్పైసీ ఫుడ్స్‌తో నిమ్మకాయను కలిపి తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నిమ్మ ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి, దీన్ని స్పైసీ ఫుడ్స్‌తో కలిపి తీసుకోవడం వేడిని తీవ్రతరం చేయడమే కాకుండా మరింత స్పైసీగా మారుతాయంటున్నారు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
రెడ్ వైన్ : నిమ్మకాయతో కలిపి రెడ్ వైన్, దాని ఆధారిత ఫుడ్స్ కూడా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. అలాగే రెడ్ వైన్ ఆధారిత సాస్ కూడా తీసుకోకూడదని చెబుతున్నారు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల వాటి రుచి దెబ్బతినడమే కాకుండా కడుపులో యాసిడ్ రియాక్షన్ ఏర్పడుతుందంటున్నారు.
అలర్ట్: ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా? - ఈ సమస్యలున్న వారు తాగితే అంతే!
మజ్జిగ, పెరుగు : మజ్జిగ, పెరుగులోనూ నిమ్మ రసం కలిపి తీసుకోకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని కలిపి తీసుకోవడం వల్ల పొట్టలో యాసిడిక్ రియాక్షన్ ఏర్పడి దాని కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.
2016లో 'జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు నిమ్మకాయతో కలిపి మజ్జిగ తాగిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు, అతిసారం వంటి లక్షణాలను ఎక్కువగా అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ జాన్సన్ పాల్గొన్నారు. మజ్జిగ, నిమ్మకాయ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
సీ ఫుడ్స్ : చాలా మంది తరచుగా నిమ్మకాయను సీఫుడ్‌తో కలిపి ఉపయోగిస్తారు. అయితే, ఇలా తీసుకోవడం ద్వారా కొన్నిసార్లు కడపులో యాసిడ్స్ రియాక్షన్ తలెత్తి కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చంటున్నారు నిపుణులు.
స్వీట్ ఫ్రూట్స్ : మీరు నిమ్మకాయతో కలిపి తీసుకోకూడని మరో ఆహార పదార్థమేమిటంటే.. స్వీట్ ఫ్రూట్స్. ఎందుకంటే.. లెమన్ రుచి పులుపుగా ఉంటుంది. ఇది తీపి పండ్లను ప్రభావితం చేస్తుందంటున్నారు. పుచ్చకాయ, స్ట్రాబెర్రీలతో కలిపి తీసుకోవడం వల్ల వాటి రుచి కోల్పోతాయంటున్నారు. నిమ్మరసానికి బదులుగా వీటి రుచి పెరగాలంటే తేనెను కలిపి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఆల్కలైన్ కూరగాయలు : నిమ్మకాయతో పాలకూర వంటి ఆల్కలైన్ కూరగాయలు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే నిమ్మలో ఉండే యాసిడిక్ లక్షణం వాటిని కలపడం వల్ల ఈ ఆకుకూరలు నల్లగా మారి రుచిని కోల్పోతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా? - VASTU TIPS FOR LEMON PLANT