ETV Bharat / offbeat

కోవా లేకుండానే "కమ్మటి గులాబ్ జామున్​" - ఇలా చేస్తే వన్ మోర్ ప్లీజ్ అంటారు!

- చిలగడదుంపలతో టేస్టీ గులాబ్​ జామున్​ - ఇలా ఈజీగా తయారు చేసుకోండి

Sweet Potato Gulab Jamun
Sweet Potato Gulab Jamun Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Sweet Potato Gulab Jamun Recipe : మనలో చాలా మందికి ఇష్టమైన స్వీట్లలో గులాబ్​ జామున్ కూడా ఒకటి. గులాబ్​ జామున్ కప్పులో కాస్త ఐస్​క్రీమ్​ వేసుకుని తింటే.. టేస్ట్​ అమృతంలా ఉంటుంది! అయితే, ఇంట్లో గులాబ్​ జామున్​ చేయాలంటే కోవా వంటి రకరకాల పదార్థాలు ఉండాలని చాలా మంది ఈ స్వీట్​ ట్రై చేయకుండా ఉంటారు.

అయితే.. ఇవేవీ లేకుండానే కమ్మటి గులాబ్​ జామున్​ చేయొచ్చని మీకు తెలుసా ? అవునండీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిలగడదుంపలతోనూ టేస్టీ గులాబ్​ జామున్​ ప్రిపేర్​ చేయవచ్చు. ఇది చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా "కమ్మని చిలగడదుంప గులాబ్​ జామున్​" ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • చిలగడ దుంప-250 గ్రాములు
  • మిల్క్​ పౌడర్​-3 టేబుల్​స్పూన్లు
  • మైదాపిండి-2 టేబుల్​స్పూన్లు

పాకం కోసం..

  • షుగర్​-కప్పు
  • నీళ్లు-కప్పు
  • యాలకుల పొడి-అరటీస్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా పాకం కోసం.. స్టౌపై ఒక గిన్నె పెట్టండి. ఇందులో పంచదార, నీళ్లు పోసి వేడి చేయండి.
  • పాకం చిక్కగా మారిన తర్వాత యాలకుల పొడి వేసి 2 నిమిషాలు మరిగించండి.
  • పాకం.. గులాబ్​ జామున్​ సిరప్​లా తయారయ్యాక స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు చిలగడదుంపలను శుభ్రంగా కడగండి. తర్వాత చిలగడ దుంపలను ఆవిరికి ఉడికించుకోండి. (వీటిని నీటిలో ఉడికించుకుంటే.. గులాబ్​ జామున్​లు చేయడం రాదు)
  • చిలగడదుంపలు చల్లారిన తర్వాత.. వాటిపైన ఉన్న పొట్టు తీసేసుకోండి. అలాగే నార లేకుండా పూర్తిగా కేవలం గుజ్జును మాత్రమే తీసుకోండి.
  • తర్వాత చిలగడ దుంప మిశ్రమాన్ని చేతితో మెదుపుకోండి. (మిశ్రమంలో ఉండలు లేకుండా సాఫ్ట్​గా ఉండాలి)
  • ఇందులో మైదాపిండి, మిల్క్​పౌడర్​ వేసి బాగా మిక్స్​ చేయండి. అలాగే కొద్దిగా వంటసోడా వేసి కలపండి.
  • తర్వాత కొద్దిగా నెయ్యి పోసి మిశ్రమాన్ని కలుపుకోండి.
  • ఆపై గులాబ్​ జామున్ల మాదిరిగా చిన్నచిన్న ఉండలు చేసి ప్లేట్లో పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయండి.
  • నూనె వేడయ్యక స్టౌ మీడియంలో ఫ్లేమ్​లో ఉంచుకుని గులాబ్​ జామున్​ బాల్స్​ ఒక్కోటిగా వేయండి.
  • ఒక నిమిషం తర్వాత గరిటెతో తిప్పి గులాబ్​ జామున్​లను బాగా ఫ్రై చేసుకోండి.
  • రెండువైపుల చక్కగా రంగు మారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసి.. అరగంటపాటు అలా వదిలేయండి.
  • తర్వాత ఈ గులాబ్​ జామున్​లు తింటే టేస్ట్​ అద్భుతంగా ఉంటాయి.
  • నచ్చితే మీరు కూడా ఈ ఇలా హెల్దీగా గులాబ్​ జామున్​లు ఓసారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

మీ ఇంట్లో కొబ్బరి మిగిలిపోయిందా? - ఇలా "కాలా జామూన్" చేసుకోండి- నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!

దీపావళి వేళ ఈ వెరైటీ బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా? - చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.