ETV Bharat / offbeat

సొరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది! - Sorakaya Pachadi

author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

Sorakaya Pachadi Recipe : చాలా మంది ఇష్టపడని కూరగాయల్లో సొరకాయ కూడా ఉంటుంది. కానీ.. దాని ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం. అందుకే తప్పక తినాలి. అయితే.. కర్రీ తినడం ఇష్టంలేని వాళ్లు పచ్చిమిర్చితో కలిపి అద్దిరిపోయే రోటీ పచ్చడి తయారు చేసుకోవచ్చు. మరి, ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Tasty Bottle Gourd Chutney
Sorakaya Pachadi Recipe (ETV Bharat)

How to Make Tasty Bottle Gourd Chutney : ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో సొరకాయ ఒకటి. అయితే చాలా మంది సొరకాయతో కర్రీ చేస్తుంటారు. కానీ.. సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి కూడా చేయొచ్చు. దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ ఫీలింగ్ వేరే లెవల్​లో ఉంటుంది! మరి, ఈ టేస్టీ సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • సొరకాయ ముక్కలు - పావుకిలో
  • పల్ల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 10
  • టమాటాలు - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • పసుపు - చిటికెడు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • పోపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన టమాటాలు, కొత్తిమీరను తరిగి పెట్టుకోవాలి
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక.. ముందుగా పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో ధనియాలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • పచ్చిమిర్చి మంచిగా వేగాయనుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే నూనెలో సొరకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మంట మీద 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఐదు నిమిషాలయ్యాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పసుపు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​పై మూతపెట్టి మధ్యమధ్యలో గరిటెతో కలుపుకుంటూ సొరకాయ, టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. అందులో కొత్తిమీర తరుగు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులో వేయించుకుని పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కల మిశ్రమాన్నీ వేసుకొని పచ్చడిని కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది.
  • అందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాళింపు వేగాక.. దాన్ని ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "సొరకాయ పచ్చడి" రెడీ!

ఇవీ చదవండి :

సొరకాయ దోశ ట్రై చేశారా?- బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

క్రిస్పీ "మెంతికూర బిస్కెట్లు" - ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి - సూపర్ టేస్టీ​గా ఉంటాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.