ETV Bharat / offbeat

"సీతాఫల్​ సేమియా పాయసం" - రుచి అమృతాన్ని మించి - ఒక్కసారి టేస్ట్​ చేస్తే జిందగీ ఖుష్!

- సీతాఫలంతో అద్దిరిపోయే స్వీట్​ -నిమిషాల్లో ప్రిపేర్​ చేసుకోవచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Sitaphal Semiya Payasam in Telugu
Sitaphal Semiya Payasam in Telugu (ETV Bharat)

Sitaphal Semiya Payasam in Telugu: సేమియా పాయసం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. పాలు పంచదారతో చేసే ఈ వంటకాన్ని ఎంతో మంది ఇష్టంగా తింటారు. అంతేనా.. దేవుళ్లకు నైవేద్యంగా, బర్త్​డేలు, వెడ్డింగ్​ డేలకు, ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఈ రెసిపీ వడ్డిస్తుంటారు. అయితే.. ఈ సేమియా పాయాసాన్ని ఎప్పుడూ ఓకే రకంగా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా సీతాఫలం గుజ్జుతో చేయండి.

కస్టర్డ్​ యాపిల్​తో ఎన్నో రకాల రెసిపీలు చేయవచ్చు. అందులో సీతాఫలం సేమియా పాయసం కూడా ఒకటి. ఎప్పుడూ సీతాఫలాన్ని నేరుగా తినడమే కాకుండా.. ఓసారి ఇలా ట్రై చేయండి.. అద్భుతం అనకుండా ఉండలేరు. పైగా ఇందులోకి పంచదార కూడా అవసరం లేదు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • సీతాఫలం గుజ్జు - 1 కప్పు
  • పాలు - అర లీటర్​
  • సేమియా - 1 కప్పు
  • జీడిపప్పు - 6 టేబుల్​ స్పూన్లు
  • యాలకులు -3
  • కండెన్స్డ్ మిల్క్​ - 1 కప్పు
  • నెయ్యి - తగినంత

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి 3 టేబుల్​ స్పూన్లు జీడిపప్పు, యాలకులు వేసి నీళ్లు పోసి ఓ గంట సేపు నానబెట్టాలి. అవి నానిన తర్వాత నీళ్లతో సహా మిక్సీజార్​లో వేసి మెత్తగా పేస్ట్​ చేయాలి.
  • ఇప్పుడు బాగా పండిన, తీయగా ఉన్నా సీతాఫలాలు తీసుకుని వాటిలోని గుజ్జును సెపరేట్​ చేయాలి. ఇలా మొత్తంగా ఒక కప్పు గుజ్జును తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 3 టేబుల్​ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులోకి మిగిలిన జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో సేమియా వేసుకుని దోరగా వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
  • తర్వాత అదే పాన్​లో పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు రెండున్నర కప్పుల నీళ్లు పోసి స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తర్వాత అందులోకి వేయించుకున్న సేమియా వేసి మీడియం ఫ్లేమ్​ మీద కలుపుతూ ఉండాలి. అనంతరం అందులోకి మిక్సీ పట్టుకున్న కాజు పేస్ట్​ వేసి సేమియాను కలుపుతూనే ఉడికించుకోవాలి.
  • సేమ్యా ఉడికిన తర్వాత కండెన్స్​డ్​ మిల్క్​ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • సుమారు 40 నిమిషాల తర్వాత అంటే సేమియా పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత సీతాఫలం గుజ్జు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. సేమియా పాయసం వేడిగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జు వేస్తే పాయసం విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చల్లారిన తర్వాత వేసుకుంటే చాలు.
  • ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలం సేమియా పాయసం రెడీ. దీన్ని వేడిగా కంటే ఫ్రిడ్జ్​లో పెట్టుకుని కూల్​గా ఉన్నప్పుడు తింటే ఆ ఫీలింగ్​ వేరే లెవల్​. మరి నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

"మసాలా వడ" అద్దిరిపోయే స్నాక్ - ఇలా చేస్తే సూపర్ క్రిస్పీగా వస్తుంది!

ఎప్పుడూ పానీపూరీ, పునుగులేనా? - ఈ సారి "మటర్ కుల్చా" ట్రై చేయండి - అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.