Restaurant Style Chilli Eggs : ఎగ్స్‌తో ఎన్నో రకాల వంటకాలు చేయచ్చు. వీటితో ఏ రెసిపీ చేసినా టేస్ట్ అద్దిరిపోతుంది. అయితే.. ఈ రెసిపీలలో రెస్టారెంట్ స్టైల్లో చేసే "చిల్లీ ఎగ్స్" మాత్రం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా ఇంట్లోనే చిల్లీ ఎగ్స్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేస్తే పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా టేస్టీగా చిల్లీ ఎగ్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గుడ్లు-6
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-4
- క్యాప్సికం-1
- వెల్లుల్లి రెబ్బలు-10
- అల్లం చిన్న ముక్కలు-2
- కార్న్ ఫ్లోర్-5 టేబుల్‌స్పూన్లు
- మైదా-5 టేబుల్‌స్పూన్లు
- వైట్ పెప్పర్ పౌడర్-అరటీస్పూన్
- వెజ్ అరోమాటిక్ పౌడర్-టేబుల్‌స్పూన్
చిల్లీ ఎగ్స్ ఫ్రై చేయడం కోసం :
- నూనె సరిపడా
- రెడ్ చిల్లీ సాస్-2 టేబుల్‌స్పూన్లు
- టమాటాసాస్-టేబుల్‌స్పూన్
- డార్క్సోయా సాస్-టేబుల్‌స్పూన్
- గ్రీన్ చిల్లీ సాస్-టేబుల్‌స్పూన్
- వెజ్ అరోమాటిక్ పౌడర్-అరటీస్పూన్
- వైట్ పెప్పర్ పౌడర్-అరటీస్పూన్
- షుగర్-టీస్పూన్
- కొత్తిమీర తరుగు
తయారీ విధానం :
- ముందుగా 5 ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసేసుకోవాలి. ఆపై వాటిని నాలుగు భాగాలు పొడవుగా కట్ చేయాలి.
- ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆపై వెల్లుల్లి రెబ్బలు, అల్లం సన్నగా తురుముకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఎగ్స్ పగలగొట్టి తీసుకోండి. ఇందులో కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, వైట్ పెప్పర్ పౌడర్, వెజ్ అరోమాటిక్ పౌడర్, కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేయండి. (పిండి మిర్చీ బజ్జీ పిండిలా ఉండాలి.)
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆయిల్ పోయండి. నూనె వేడయ్యాక ఎగ్ ముక్క ఒక్కోటీ.. పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేయండి.
- వీటిని రెండు వైపులా దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు చిల్లీ ఎగ్స్ ఫ్రై చేయడం కోసం స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై వెల్లుల్లి, అల్లం తురుము వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు వేసి వేపండి.
- ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత రెడ్ చిల్లీ సాస్, టమాటాసాస్, డార్క్సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలపండి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోయండి.
- ఆపై వెజ్ అరోమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, షుగర్, కాస్త ఉప్పు, కొన్ని నీళ్లు పోసి స్టౌ హై ఫ్లేమ్‌లో పెట్టి కలపండి.
- తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి కలపండి. ఒక నిమిషం తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లీ స్టౌ ఆఫ్ చేయండి.
- అంతే ఇలా చేస్తే వేడివేడి చిల్లీ ఎగ్స్ మీ ముందుంటాయి.
- నచ్చితే ఈ విధంగా ఎగ్స్‌తో సరికొత్త రెసిపీ ట్రై చేయండి.
- ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.
ఇవి కూడా చదవండి :
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటే డేంజర్ - ఇంట్లోనే "ఎగ్ నూడుల్స్" ఇలా చేసుకోండి!
ఎప్పుడూ ఆనియన్ సమోసా ఏం బాగుంటుంది - ఓసారి "ఎగ్ సమోసా" ట్రై చేయండి - టేస్ట్ అద్దిరిపోతుంది!