ETV Bharat / offbeat

నోరూరించే "రవ్వ పులిహోర" - కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది! - RAVA PULIHORA RECIPE

అన్నంతో చేసుకునే రెగ్యులర్ పులిహోరను మించిన టేస్ట్ - ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ!

Rava Pulihora Recipe
Rava Pulihora (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 3:43 PM IST

Rava Pulihora Recipe in Telugu : పండగొచ్చినా, పబ్బమొచ్చినా, చుట్టాలొచ్చినా, అన్నం మిగిలిపోయినా.. చాలా మంది ప్రిపేర్ చేసుకునే రెసిపీలలో పులిహోర ముందు వరుసలో ఉంటుంది. అయితే, ఎప్పుడూ అన్నంతో చేసిన పులిహోర తినాలంటే బోరింగ్​గా అనిపించొచ్చు. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయండి. అదే.. "రవ్వ పులిహోర". టేస్ట్ అద్దిరిపోతుంది! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. పదే పది నిమిషాల్లో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం రవ్వ - 2 కప్పులు
  • నీళ్లు - 4 కప్పులు
  • ఉప్పు - కొద్దిగా
  • నూనె - 1 టీస్పూన్

తాలింపు కోసం:

  • నూనె - తగినంత
  • పల్లీలు - పావు కప్పు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • మినప్పప్పు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 4
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 4
  • అల్లం తరుగు - 1 టేబుల్​స్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - అరటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మకాయ రసం - 3 నుంచి 4 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో నూనె, ఉప్పు వేసుకొని కలిపి మరిగించుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వను మెల్లిగా గరిటెతో కలుపుతూ వేసుకోవాలి. ఆ తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి నీళ్లు ఆవిరై రవ్వ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక దాన్ని ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత దాన్ని పొడిపొడిగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఆలోపు తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై మరో పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పల్లీలను వేసుకొని దోరగా రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో ఆయిల్ సరిపడా లేకపోతే మరికొద్దిగా వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం తరుగు, ఇంగువ వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఆఖరున పసుపు వేసుకొని కలిపి 30 సెకన్ల పాటు వేయించుకొని దింపేసుకోవాలి. మీ వీలును బట్టి కొన్ని జీడిపప్పు పలుకులు తాలింపులో వేసుకోవచ్చు.
  • అనంతరం వేగిన తాలింపుని ఉడికించి పొడిపొడిగా చేసుకున్న రవ్వలో వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
  • ఇక చివరగా వేయించిన పల్లీలను కూడా వేసుకొని కలిపి పైన కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే... ఎంతో టేస్టీగా ఉండే "రవ్వ ఉప్మా" రెడీ!

ఇవీ చదవండి :

సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

పోషకాలతో నిండిన అన్ని పప్పుల అద్భుత "కిచిడీ" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.