ETV Bharat / offbeat

ఆశ్చర్యం : బరువు తగ్గడానికి బంగాళాదుంపలు! - నిపుణులు చెబుతున్నది ఇదే! - Potatoes Weight Loss - POTATOES WEIGHT LOSS

Potatoes Weight Loss : బరువు తగ్గాలనుకునేవారు వర్కవుట్లతో చెమట చిందిస్తారు. కానీ.. ఎలాంటి తిండి తినాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇలాంటి వారికి బంగాళాదుంపలు మేలు చేస్తాయని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Weight Loss
Potatoes Weight Loss (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 10:57 AM IST

Potatoes Help In Reducing Weight : అనేక కారణాల వల్ల నేటి ఆధునిక కాలంలో ఎంతో మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరిగిన తర్వాత ఎక్సర్​సైజ్​లు చేస్తుంటారు. అయితే.. మంచి డైట్ పాయిటిస్తే వెయిట్​లాస్​ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్​లో బంగాళాదుంపలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

పోషకాలు అధికం :

ఆలుగడ్డలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో కాంప్లెక్స్​ కార్బోహైడ్రేట్స్​ అధికంగా ఉంటాయి. ఇవి రోజంతా శక్తిని అందిస్తాయి. అలాగే విటమిన్​ సి, బి6 వంటివి రోగనిరోధక శక్తి పెంచడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా డైటరీ ఫైబర్​ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు డైట్​లో బంగాళాదుంపలను భాగం చేసుకోవడం వల్ల వెయిట్​లాస్​ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

తక్కువ కేలరీలు :
అధిక బరువుతో బాధపడేవారు తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి వారు బంగాళాదుంపలను (national library of medicine report) క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే.. ఇందులో చాలా తక్కువ కేలరీలుంటాయి. మీడియమ్​ సైజ్​ బంగాళాదుంపలో సుమారు 110 క్యాలరీలుంటాయట. 2014లో 'అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక బరువుతో బాధపడేవారు డైట్‌లో బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల బరువు తగ్గారని నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ నికోలా M. మెక్‌కీన్' పాల్గొన్నారు.

ఫైబర్​ అధికం :
బంగాళాదుంపలను పొట్టుతో కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువగా ఫైబర్​ శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండానే పొట్ట నిండిన ఫీలింగ్​ కలుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

  • అలాగే బంగాళాదుంపలో ఉండే రెసిస్టెంట్​ స్టార్చ్​ ఒక రకమైన ఫైబర్‌ను ఏర్పరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెయిట్​లాస్​ కోసం ప్రయత్నించేవారు పొటాటోలు తినడం ద్వారా ఎక్కువసేపు ఆకలి కాకుండా చూసుకోవచ్చు. ఇంకా కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండుగా ఉన్నట్టుగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • పొటాటోలలో గ్లైసెమిక్​ ఇండెక్స్​ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

బరువు తగ్గాలనుకుంటున్నారా? - పెరట్లో పెరిగే ఈ కూరగాయను తింటే వెయిట్ లాస్ పక్కా!

మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే హెల్తీ వెయిట్ గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.