ETV Bharat / offbeat

టేస్టీ హోటల్‌ స్టైల్ "పనీర్‌ బ్రెడ్‌ రోల్‌" - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా - Paneer Bread Roll Recipe - PANEER BREAD ROLL RECIPE

Paneer Bread Roll Recipe : చాలా మంది పిల్లలు పోషకాలు పుష్కలంగా ఉండే పనీర్​ను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి సాయంత్రం పూట ఇలా "పనీర్ బ్రెడ్ రోల్స్" ప్రిపేర్ చేసి ఇవ్వండి.. లొట్టలేసుకుని మరీ తింటారు. ఇవి రుచిలో హోటల్​లో లభించే వాటికి ఏమాత్రం తీసిపోవు! మరి.. ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Hotel Style Paneer Bread Rolls
Paneer Bread Roll Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 1, 2024, 9:49 AM IST

How to Make Hotel Style Paneer Bread Roll : పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. పైగా వీటితో చేసే కూరలు, స్వీట్లను చాలామంది ఇష్టపడి తింటుంటారు. ఈక్రమంలో పనీర్‌తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసమే ఒక అద్భుతమైన స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. హోటల్ స్టైల్ పనీర్ బ్రెడ్ రోల్స్. టేస్ట్​ చాలా సూపర్​గా ఉంటాయి! పైగా ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయట. ఇంతకీ.. ఈ రుచికరమైన పనీర్‌ బ్రెడ్ రోల్స్ తయారీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పనీర్‌ - 100 గ్రాములు
  • మిల్క్‌బ్రెడ్‌ స్లైసులు - 12
  • పచ్చిమిర్చి - 2
  • బంగాళదుంపలు - 3
  • 2 టేబుల్ స్పూన్లు - మైదా
  • పావు కప్పు - ఉల్లిపాయ తరుగు
  • అర చెంచా - కారం
  • అర చెంచా - చాట్ మసాలా
  • కొద్దిగా - అల్లం వెల్లుల్లి పేస్ట్
  • చిటికెడు - పసుపు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • తగినంత - నూనె
  • చెంచా - నిమ్మరసం

తయారీ విధానం :

  • ముందుగా పనీర్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. బంగాళదుంపలను ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఆలూ ఉడికే లోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పనీర్​ను తురుముకొని రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని రెండు టేబుల్స్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోధుమరంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో.. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆపై పసుపు, చాట్‌ మసాలా, కారం, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. ఆ మిశ్రమంలో తురిమి పక్కన ఉంచుకున్న పనీర్, కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు, ఉప్పు యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆఖర్లో నిమ్మరసం వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసి పాన్​ను దింపి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు బ్రెడ్ స్లైసులను తీసుకొని.. వాటి అంచులను కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్లైసు చెంచా పనీర్‌ మసాలా వేసి.. మరో బ్రెడ్‌ను దాని మీద ఉంచి అంచులను కప్పేయాలి.
  • అనంతరం మసాలా బయటకు రాకుండా మెల్లగా రోల్‌ చేయాలి. ఆవిధంగానే మిగతా స్లైసులూ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఒక బౌల్​లో కొన్ని నీళ్లు తీసుకొని మైదాపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్ రోల్స్​ని మైదాపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
  • ఆపై మంటను అడ్జస్ట్ చేసుకుంటూ అవి బంగారు రంగు వచ్చేంత వరకూ వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. వాటిని టిష్యూ పేపర్‌ మీదికి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువగా ఉన్న నూనెను అది పీల్చేసుకుంటుంది.
  • ఆపై వాటిని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ "పనీర్‌ బ్రెడ్‌ రోల్స్" రెడీ!
  • వేడివేడిగా ఈ పనీర్‌ రోల్స్‌ను టమాటా సాస్‌ లేదా నచ్చిన చట్నీతో తింటే ఆ రుచి చాలా బాగుంటుంది.

ఇవీ చదవండి :

పప్పులు నానబెట్టకుండానే బియ్యంతో "చిట్టి పునుగులు" - టేస్ట్ బండ్లపై దొరికే వాటికి ఏమాత్రం తీసిపోదు!

బియ్యం పిండితో కాదు.. అటుకులతో కరకరలాడే జంతికలు! - సూపర్ స్నాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.