ETV Bharat / offbeat

బంధువులు వస్తే చికెన్, మటన్ కంటే - ఇలా "పాలకూర ఉల్లికారం" చేసి పెట్టండి! - ఇష్టంగా తింటారు!

అన్నం, చపాతీల్లోకి సూపర్ టేస్టీగా ఉండే 'పాలకూర కారం' - ఈజీగా చేసేయండిలా!

Palakura Karam Recipe in Telugu
Palakura Ulli Karam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Palakura Ulli Karam Recipe in Telugu : పోషకాలు పుష్కలంగా ఉండే ఆకుకూరల్లో ఒకటి పాలకూర. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, మీరు ఇప్పటి వరకు పాలకూర పప్పు, వేపుడు వంటివి ప్రిపేర్ చేసుకొని ఉంటారు. కానీ, ఓసారి ఇలా "పాలకూర ఉల్లికారం" ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు! అంతేకాదు.. పాలకూర అంటే ఇష్టపడని వారూ దీన్ని లొట్టలేసుకుంటూ లాగిస్తారు. ఇంతకీ, ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర కట్టలు - 4(చిన్న సైజ్​వి)
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • శనగపప్పు - అరటీస్పూన్
  • వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - పావుటీస్పూన్

ఉల్లికారం కోసం :

  • మీడియం సైజ్ ఉల్లిపాయలు - 3
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 5 నుంచి 6
  • చింతపండు - రెండు రెబ్బలు
  • ఉప్పు - తగినంత
  • కారం - 2 టీస్పూన్లు

ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నని కాడలనూ కట్ చేసి తీసుకోవాలి. లావుగా ఉండేవి పక్కన పడేయాలి.
  • ఆవిధంగా కట్ చేసుకున్న పాలకూరను ఒక బౌల్​లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
  • అవి వేగాక ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు వేసుకొని ఆనియన్స్ కాస్త గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లోకి తీసుకున్న ధనియాల మిశ్రమాన్ని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయలు కనబడేలా బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై మరో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఫ్రెష్​గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగిందనుకున్నాక పసుపు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర తరుగు వేసి స్టౌను మీడియం టూ హై ఫ్లేమ్​కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక పాలకూర చక్కగా వేగి మిశ్రమం కాస్త దగ్గరపడుతుంది. అప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత పాన్​పై మూతపెట్టి లో ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆపై మూత తీసి కలిపి స్టౌ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "పాలకూర ఉల్లికారం" రెడీ!
  • దీన్ని చపాతీ, అన్నం దేనిలోకి తిన్నా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరూ ఓసారి ఇలా పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

నోరూరించే "పాలకూర వేపుడు" - ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్ట్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.