ETV Bharat / offbeat

పదే పది నిమిషాల్లో పసందైన "పచ్చిమిర్చి వేపుడు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అమృతమే! - Pachimirchi Vepudu Recipe

Pachimirchi Vepudu Recipe : చాలా మందికి వేపుళ్లు అనగానే.. దొండకాయ, బెండకాయ, ఆలూ, కాకర, చికెన్ ఫ్రై వంటివి మాత్రమే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ, అలాకాకుండా మీరు ఎప్పుడైనా "పచ్చిమిర్చితో ఫ్రై"ని ప్రయత్నించి చూశారా? లేదంటే ఓసారి ట్రై చేయాల్సిందే! మరి.. సూపర్ టేస్టీగా ఉండే ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Pachimirchi Vepudu
Pachimirchi Vepudu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 27, 2024, 4:58 PM IST

How to Make Pachimirchi Vepudu Recipe : మనందరికీ కూరలలో వేగంగా అయిపోయే రెసిపీ అంటే ముందుగా వేపుళ్లే గుర్తుకొస్తాయి. అందులోనూ.. దొండకాయ, బెండకాయ, ఆలూ, కాకర, ఎగ్, చికెన్ ఫ్రై వంటివి ముదు వరుసలో ఉంటాయి. అయితే, అవి మాత్రమే కాదు.. పచ్చిమిర్చితోనూ అద్దిరిపోయే టేస్ట్​తో ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా? ఈ పచ్చిమిర్చి వేపుడుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్​లో ఉంటుంది. ఇంతకీ.. పచ్చిమిర్చి వేపుడుకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బజ్జీ మిర్చి - పావుకిలో
  • ఆయిల్ - పావు కప్పు
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • ఇంగువ - 2 చిటికెళ్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పసుపు - పావు చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - అర టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • శనగపిండి - అర కప్పు
  • నిమ్మరసం - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బజ్జీ మిర్చిని తొడిమలు తీసి శుభ్రంగా కడిగి ఒక అంగుళం పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే, ఇక్కడ మామూలు మిర్చి ఫ్రైకి యూజ్ కావు. ఎందుకంటే.. అవి కారంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి చిటపటలాడించుకోవాలి.
  • ఆ తర్వాత దానిలో ముందుగా తరిగి పెట్టుకున్న మిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మిర్చిపై మచ్చలు ఏర్పడేంత వరకు వేయించుకోవాలి.
  • మిర్చి బాగా వేగి సాఫ్ట్​గా మారాయనుకున్నాక.. అందులో కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో.. ముందుగా కొద్దిగా శనగపిండిని వేసుకుని గరిటెతో కలుపుతూ అది లైట్ గోల్డెన్ కలర్​లోకి మారేంత వరకు వేయించుకోవాలి. అంటే.. మొత్తం పిండిని ఒకేసారి వేసుకుంటే శనగపిండి సరిగ్గా వేగదనే విషయాన్ని గమనించాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక.. అందులో మిగతా పిండిని వేసుకొని కలిపి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి 7 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. శనగపిండి బాగా వేగితే మంచి సువాసన వస్తుంది.
  • అప్పుడు మిశ్రమాన్ని ఒకసారి కలిపి పాన్ పై మూతపెట్టి కొద్దిసేపు లో-ఫ్లేమ్​లో వదిలేయండి. ఇలా చేయడం ద్వారా మిర్చిలో ఉండేటువంటి తేమతో పర్ఫెక్ట్​గా పిండి మగ్గిపోతుంది. ఇంకా మిర్చిలోని ఘాటును శనగపిండి పట్టేస్తుంది.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మూత తీసి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పచ్చిమిర్చి ఫ్రై" రెడీ!

ఇవీ చదవండి :

రొటీన్​ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ!

పుల్లపుల్లగా చింతకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - ఇలా చేస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.