Nellore Special Jom Pachadi : వంటింట్లో ఏ కూర వండాలన్నా నూనె, తాలింపు గింజలు తప్పకుండా ఉండాల్సిందే. ఇక పచ్చడి కోసం అయితే నూనె, తాలింపు గింజలు కాస్తంత ఎక్కువగానే వాడుతుంటాం. ఇవి లేకుంటే దాదాపు కిచెన్లో ఏ రెసిపీ తయారీ పూర్తి కాదు. అయితే, ఇవేవి లేకుండానే నోరూరించే పచ్చడి తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా ? అవునండీ.. చుక్క నూనె వాడకుండానే తయారు చేసే ఒక పచ్చడిని ఇప్పుడు చూద్దాం.
ఆయిల్ లేకుండా తయారు చేసే టేస్టీ అండ్ హెల్దీ చట్నీ.. "నెల్లూరు స్పెషల్ జోం పచ్చడి". జోం పచ్చడి ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే కారంగా, పుల్లపుల్లగా ఎంతో రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని పచ్చడితో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ పచ్చడిని చపాతీలు, పుల్కాల్లో కూడా తినవచ్చు. బరువు తగ్గాలని నూనె తక్కువగా యూజ్ చేసేవారు ఈ పచ్చడిని ఓ సారి ట్రై చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మని జోం పచ్చడి ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- పచ్చిమిర్చి-15
- చింతపండు-నిమ్మకాయ సైజంత
- బెండకాయ-4
- టమాటాలు-3
- వెల్లుల్లి రెబ్బలు-2
- ఉప్పు రుచికి సరిపడా
- నీళ్లు -గ్లాసు
జోం పచ్చడి తయారీ విధానం :
- ముందుగా బెండకాయాలు, టమాటాలు, పచ్చిమిర్చిలను కట్ చేసుకోవాలి.
- తర్వాత ఒక స్టౌపై ఒక గిన్నె పెట్టాలి. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, బెండకాయ, టమాటా ముక్కలు, చింతపండు వేయాలి. ఇందులో గ్లాసు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- టమాటాలపైన ఉన్న పొట్టూ గరిటెతో తీసుకోవాలి. బెండకాయలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు రోట్లో ఉడికించుకున్న కూరగాయలలోని పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి.
- తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి దంచుకోవాలి. తర్వాత టమాటాలు వేసి మెత్తగా దంచుకోవాలి.
- ఆపై బెండకాయలు వేసుకుని కాస్త దంచుకోవాలి.
- చివర్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు దంచుకుని జోం పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే ఇలా నూనె, కారం లేకుండా చేసుకుంటే ఎంతో కమ్మని జోం పచ్చడి తయారైపోతుంది.
- నచ్చితే మీరు కూడా ఓ సారి ఇంట్లో జోం పచ్చడి ట్రై చేయండి.
కమ్మని "సొరకాయ పొట్టు పచ్చడి" - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!
చూస్తేనే నోరూరిపోయే "వంకాయ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే అద్భుతః అనాల్సిందే!