How to Make Mutton Roast Recipe : చాలా మంది సాధారణంగా మటన్ గ్రేవీ కర్రీ వండేస్తుంటాం. లేదంటే.. బిర్యానీ ట్రై చేస్తుంటారు. అయితే.. ఈసారి మటన్ వేపుడు ట్రై చేయండి. ఎంతో రుచికరంగా ఉంటుంది! ముక్క మెత్తగా ఉడికే ఈ రెసిపీని చిన్న పిల్లలూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ.. ఈ టేస్టీ మటన్ రోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
మటన్ ఉడికించుకోవడం కోసం :
- మటన్ - అరకేజీ
- పసుపు - అర టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- లవంగాలు - 3
- దాల్చిన చెక్క - అంగుళం ముక్క
- కరివేపాకు - 1 రెమ్మ
వేపుడు కోసం :
- నూనె - 5 టేబుల్‌స్పూన్లు
- ఉల్లిపాయ - 2(మీడియం సైజ్‌వి)
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఈ కొలతలతో చేస్తే 'హోటల్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ' పక్కా! ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు!!
తయారీ విధానం :
- ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించి తెచ్చుకున్న మటన్‌ను శుభ్రంగా కడగాలి. తర్వాత మటన్‌ని కుక్కర్లోకి తీసుకొని పసుపు, 1 టీస్పూన్ చొప్పున కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి.
- ఆపై మూత పెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న మటన్ ముదురుదైతే అదనంగా మరో రెండు విజిల్స్ ఉడికించుకోవాలి. అంటే.. మటన్ మెత్తగా ఉడకాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెజర్ మొత్తం ఎయిర్ పోయాక.. మూతతీసి ఒకసారి ఆ మిశ్రమాన్ని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక.. కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకున్నాక.. అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని వాటర్‌తో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టౌను హై ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుకుంటూ వాటర్ పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందుకోసం.. 5 నుంచి 6 నిమిషాల సమయం పట్టొచ్చు.
- మటన్ మిశ్రమంలో వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు.. స్టౌను మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ మరో ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నప్పుడు మటన్ ముక్కలు మంచిగా వేగి కలర్ ఛేంజ్ అవుతాయి. అప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి 1 నుంచి 2 నిమిషాలు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మటన్ వేపుడు" రెడీ!
ఘుమఘుమలాడే "తెలంగాణ స్టైల్ తలకాయ కూర" - ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అదుర్స్!