ETV Bharat / offbeat

బండి మీద అమ్మే "ముంత మసాలా" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్! - MUNTHA MASALA RECIPE IN TELUGU

అద్దిరిపోయే ఈవెనింగ్ స్నాక్ రెసిపీ - పిల్లలకు ఇలా చేసి ఇచ్చారంటే ఫుల్​ ఖుష్!

How to Make MUNTHA MASALA
Muntha Masala Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 1:12 PM IST

Muntha Masala Recipe in Telugu : చాలా మందికి సాయంత్రం అయ్యిదంటే చాలు ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు బయటకు వెళ్లి పునుగులు, సమోసా, బజ్జీలు వంటివి టేస్ట్ చేస్తుంటారు. మరికొందరు.. బండ్ల మీద అమ్మే ముంత మసాలా, బేల్​పూరి, గప్​చుప్ వంటివి తింటుంటారు. అయితే, ముంత మసాలా తినడం కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే అతి తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్​ కూడా బండి మీద అమ్మే దానికి ఏమాత్రం తీసిపోదు! ఇంతకీ.. ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మరమరాలు - 2 కప్పులు
  • కార్న్ ఫ్లేక్స్ - అర కప్పు
  • నూనె - తగినంత
  • పల్లీలు - పాపు కప్పు
  • ఉల్లిపాయ - 1
  • టమాటా - 1
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • చాట్ మసాలా - 1 టీస్పూన్
  • నెయ్యి - 2 టీస్పూన్లు
  • నిమ్మకాయ - 1

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటాను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని చాలా సన్నని తరుగులా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని మరమరాలు వేసుకొని మీడియం ఫ్లేమ్​ మీద 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా తినేటప్పుడు మరామరాలు సాగకుండా క్రిస్పీగా ఉంటాయి.
  • అనంతరం అదే కడాయిలో కార్న్ ఫ్లేక్స్ వేయించుకోవడానికి తగినంత నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక.. కార్న్ ఫ్లేక్స్ వేసుకొని వడియాల మాదిరిగా వేయించుకోవాలి. ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్​లో టిష్యూ పేపర్ వేసి అందులోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అయితే, ఈ కార్న్ ఫ్లేక్స్ అనేవి పాలలో వేసుకునేవి కాదు. కిరాణ షాపులలో అప్పడాలు, వడియాలతో పాటు అమ్ముతుంటారు.
  • ఆ తర్వాత అదే నూనెలో పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో వేయించుకుని రెడీగా పెట్టుకున్న మరమరాలు, కార్న్​ఫ్లేక్స్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కట్ చేసుకుని పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో పాటు ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం అందులో మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకొని.. నిమ్మరసం పిండి.. వేయించుకున్న పల్లీలను వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పులుపు అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
  • అంతే.. ఎంతో రుచికరంగా ఉండే స్ట్రీట్ స్టైల్ "ముంత మసాలా" రెడీ!

అన్నం మిగిలిపోతే ఇలా "మసాలా వడలు" ప్రిపేర్ చేసుకోండి - సూపర్ టేస్టీగా ఉంటాయి గురూ!

అద్దిరిపోయే కొరియన్ స్టైల్ "పొటాటో బైట్స్" - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్కటీ వదలరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.