Diwali Special Motichoor Laddu : దీపావళి అనగానే కొత్త దుస్తులు, బాణాసంచా మోతలే కాదు.. నోరూరించే స్వీట్స్ కూడా ఉంటాయి. ఇవి తినడమే కాదు.. బంధువులకు, అతిథులకు గిఫ్ట్లగా కూడా ఇస్తుంటారు. అయితే.. దీపావళి స్వీట్స్ అనగానే లిస్ట్‌లో మైసూర్‌పాక్, బాదుషా, తొక్కుడు లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు ఇలా ఎన్నో ఉంటాయి. ఎన్ని ఉన్నా అందరీ ఫేవరెట్ రెసిపీ మోతిచూర్ లడ్డూ. దీని టేస్ట్ మరేదానికి రాదు. అందుకే చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తుంటారు.
అయితే.. బయట స్వీట్ షాప్స్‌లలో లభించే ఈ లడ్డూలో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి మోతీచూర్ లడ్డూను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమా అని షాక్ అవుతున్నారా? నిజమేనండీ.. ఎంతో రుచికరమైన లడ్డూలను చాలా సింపిల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చేయాలంటే బూందీ గరిటె అవసరమే లేదు. మరి, లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- శనగపిండి - పావు కేజీ
- నీళ్లు - ఒకటిన్నర కప్పులు(350ml)
లిక్విడ్ గ్లూకోజ్ కోసం కావాల్సిన పదార్థాలు:
- పంచదార - పావు కప్పు
- వాటర్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - చిటికెడు
- నిమ్మరసం - అర చెక్క
పాకం కోసం:
- పంచదార - 400 గ్రాములు
- నీళ్లు - ఒకటింపావు కప్పులు(300ml)
- ఆరెంజ్ లేదా యల్లో ఫుడ్ కలర్ - పావు టీ స్పూన్
- యాలకలు పొడి - 1 టీస్పూన్
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- పుచ్చపప్పు - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా లిక్విడ్ గ్లూకోజ్ తయారు చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పంచదార, నీళ్లు పోసుకోవాలి.
- ఫ్లేమ్‌ను మీడియంలో పెట్టి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
- మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి స్పూన్‌తో కలుపుతూ ముదురు తీగ పాకం వచ్చేంతవరకు కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పంచదార పాకాన్ని ఓ గిన్నెలో పోసుకుని కదపకుండా పూర్తిగా చల్లారినివ్వాలి.
- ఇప్పుడు పిండి కలుపుకోవాలి. అందుకోసం ఓ బౌల్ తీసుకుని శనగపిండిని జల్లించుకోవాలి.
- ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బజ్జీలా పిండి మాదిరి కలిపి కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి.
- ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకువాలి.
- నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా గరిటెతో బిస్కెట్ల షేప్‌లో నూనెలో వేసుకోవాలి.
- వాటిని రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
- అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్‌లోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో పంచదార, నీళ్లు పోసి ఫ్లేమ్‌ను హై to మీడియం అడ్జస్ట్ చేసుకుని పంచదారను కరిగించుకోవాలి.
- షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని మరిగించుకోవాలి.
- పాకం మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్‌ను సిమ్‌లో పెట్టుకుని పంచదార పాకం మొత్తం బూందీకి పట్టేలా ఓ 4 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత నెయ్యి, లిక్విడ్ గ్లూకోజ్ వేసి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లడ్డూ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
- లడ్డూ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చపప్పు వేసుకుని కలిపి చేతికి నెయ్యి రాసుకుని కావాల్సిన సైజ్‌లో లడ్డూల్లా చుట్టుకోవాలి.
- అనంతరం లడ్డూలపై సిల్వర్ ఫాయిల్, జీడిపప్పు పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డూ రెడీ. వీటిని జాగ్రత్తగా స్టోర్ చేస్తే సుమారు 15 రోజులు నిల్వ ఉంటాయి.
- నచ్చితే మీరూ ఈ దీపావళికి ట్రై చేయండి.
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్ సూపరంతే!
గుంటూర్ స్పెషల్ "కోవా మాల్పూరి" - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్- పైగా రుచి అద్భుతం!
దీపావళి స్పెషల్ స్వీట్ "సజ్జప్ప" - ఒకసారి చేస్తే 2 నెలలు ఉంటుంది - పైగా టేస్ట్ అద్భుతం!