ETV Bharat / offbeat

క్రిస్పీ "మెంతికూర బిస్కెట్లు" - ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి - సూపర్ టేస్టీ​గా ఉంటాయి! - Methi Biscuits Recipe

Methi Biscuits Recipe : ఎప్పుడూ మార్కెట్‌లో దొరికే బిస్కెట్లేనా.. అలాకాకుండా ఈసారి ఇంట్లోనే ఇలా ఈజీగా మెంతికూర బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోండి. ఈ బిస్కెట్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చేస్తాయి. మరి, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Methi Biscuits
Methi Biscuits Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 25, 2024, 11:08 AM IST

How to Make Methi Biscuits at Home : మెంతికూరతో కర్రీ చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ.. బిస్కెట్లు కూడా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? టేస్ట్ అదుర్స్ అనిపిస్తుంది. మరి.. మెంతికూర బిస్కెట్ల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మెంతికూర - 1 కట్ట
  • రవ్వ - అర కప్పు
  • మైదా - 2 కప్పులు
  • నెయ్యి/బటర్ - 3 చెంచాలు
  • కారం - అర స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - పావు స్పూన్
  • మిరియాల పొడి - అర టీస్పూన్
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మెంతికూరను వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రవ్వ, మైదా, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కారం.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కరిగించుకున్న నెయ్యిని వేసుకొని కాస్త ముద్దలాగా అనుకుంటూ మరోసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అయితే, ఇక్కడ మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే బటర్ యూజ్ చేసినా బిస్కెట్లు మంచి టేస్ట్ వస్తాయి.
  • ఆ విధంగా పిండిని కలుపుకున్నాక.. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర తరుగును అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే, మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా బిస్కట్లు మంచి షేప్​లో రావనే విషయం గుర్తుంచుకోవాలి.
  • అనంతరం చపాతీ పీటపై కాస్త పొడి పిండి చల్లుకొని కలిపిపెట్టుకున్న పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండి తీసుకొని చపాతీ రోలర్ సహాయంతో పిండిని రొట్టెలా వత్తుకోవాలి.
  • అయితే.. మరీ పల్చగా కాకుండా చపాతీ కన్నా కాస్త మందం ఉండేలా చూసుకోవాలి.
  • ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక.. దాని మీద గ్లాసు లేదా మూతతో నొక్కి గుండ్రటి ఆకృతులు వచ్చేలా కట్‌ చేయాలి. లేదంటే.. చాకు లేదా పిజ్జా కట్టర్ సహాయంతో మీకు ఇష్టమైన ఆకృతులలో కట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాటి మీద ఫోర్క్‌తో గుచ్చి, రంధ్రాలు చేసుకోవాలి. ఆవిధంగా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ప్రిపేర్ చేసుకున్న బిస్కట్లను అందులో వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
  • ఇక అవి ఎప్పుడైతే బాగా వేగి కాస్త రంగు మారగానే ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. టేస్టీగా ఉండే క్రిస్పీ 'మెంతికూర రవ్వ బిస్కెట్లు' రెడీ!
  • ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుంటే వాటిని చల్లారాక గాలిచొరబడని కంటెయినర్​లో స్టోర్ చేసుకుంటే చాలు. కనీసం 15 రోజులు ఫ్రెష్​గా ఉంటాయి! మరి, ఆలస్యమెందుకు నచ్చితే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.

ఇవీ చదవండి :

నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్​ ఛాయిస్​ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!

ఇంట్లోనే అద్భుతమైన పావ్​భాజీ బర్గర్ - స్ట్రీట్​ ఫుడ్​ అంత టేస్టీగా.. అంతకు మించిన హెల్తీ​గా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.