Super Snack Recipe with Leftover Rice : ఇంట్లో రైస్ మిగిలిపోతే చాలా మంది.. పులిహోర, ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ రొటిన్‌గా అవే కాకుండా ఈసారి ఇంట్లో అన్నం మిగిలిపోతే కాస్త డిఫరెంట్‌గా ఈ సూపర్ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. రుచి కూడా అద్భుతం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయ తరుగు - 1 కప్పు
- ఉప్పు - 1 టీస్పూన్
- అన్నం - 1 కప్పు
- బంగాళదుంపలు - 2(మీడియం సైజ్‌వి)
- కారం - తగినంత
- పసుపు - చిటికెడు
- మిరియాల పొడి - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఇంగువ - పావు టీస్పూన్
- వాము - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఆయిల్ - తగినంత
- శనగపిండి - అర కప్పు
అద్దిరిపోయే కొరియన్ స్టైల్ "పొటాటో బైట్స్" - ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఒక్కటీ వదలరు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను ఒక కప్పు పరిమాణంలో సన్నగా పొడుగ్గా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- అలాగే.. బంగాళదుంపలను పొట్టు తీసి గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకొని వాటర్‌లో వేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుతో పాటు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత వాటిని చేతితో ఒకసారి బాగా పిండితే వాటి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అలా పిండుకున్నాక అందులో మీరు ఉల్లిపాయ తరుగు తీసుకున్న కప్పుతో రైస్‌ని వేసుకోవాలి. అలాగే.. వాటర్‌లో వేసుకున్న ఆలూ తురుముని చేతితో పిండి వేసుకొని చేతితో ప్రెస్ చేస్తూ అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి.
- ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక.. అందులో కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, వాము, సన్నని పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో పాటు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- అలా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాక.. శనగపిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిలో నుంచి కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ మసాలా వడల మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో ఉంచి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. మీరు ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే సూపర్ స్నాక్ రెసిపీ రెడీ!
- మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా వడలను సాయంత్రం పూట టమాటా సాస్‌లో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుంది!
బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!