ETV Bharat / offbeat

జొన్న రొట్టెలు చేయడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ​! పైగా సూపర్​ సాఫ్ట్​! - Jowar Roti Recipe - JOWAR ROTI RECIPE

Jowar Roti Recipe in Telugu : జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ.. అవి తయారు చేయడం అందరికీ రాదు. వచ్చినా.. అది చాలా ప్రాసెస్​తో కూడుకున్న పనిగా భావిస్తారు. అయితే.. ఈ టిప్స్​ పాటిస్తే చాలా ఈజీగా చపాతీల కంటే ఫాస్ట్​గా జొన్న రొట్టెలు చేసుకోవచ్చు!

How To Make Jowar Roti
Jowar Roti Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 3, 2024, 4:24 PM IST

How To Make Jowar Roti Easily At Home : అధిక బరువు, షుగర్​తో బాధపడుతున్నవారికి జొన్నలతో చేసిన ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి. అందులో ముఖ్యంగా చాలా మంది ఎక్కువగా జొన్నరొట్టెలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొందరికి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక బయట నుంచి కొని తెచ్చుకుంటుంటారు. ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా అవి పర్ఫెక్ట్​గా రావు. చేసిన కొద్దిసేపటికే గట్టి పడి విరిగిపోతుంటాయని బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా సులభంగా జొన్న రొట్టలు(Jowar Roti) తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్న పిండి - 1 కప్పు
  • వాటర్ - 1 కప్పు
  • ఉప్పు - చిటికెడు

తయారీ విధానం :

  • ఇందుకోసం.. ముందుగా స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నీటిని బాగా మరిగించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మరిగిన నీటిలో జొన్నపిండిని వేసుకొని గరిటెతో ఓ సారి పిండి మొత్తం తడిసేలా కలుపుకొని మూతపెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే.. మిశ్రమం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి అది కాస్త గోరువెచ్చగా మారేవరకు పక్కన పెట్టుకోవాలి.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మీరు వాటర్ ఏ కప్పుతో పోసుకున్నారో అదే కప్పుతో జొన్నపిండిని తీసుకోవాలి.
  • అనంతరం పిండి గోరువెచ్చగా మారాక దాన్ని పొడవాటి బౌల్​లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు చేతితో పిండి సాఫ్ట్​గా మారే వరకు బాగా కలుపుకోవాలి.
  • ఒకవేళ పిండి జిగటగా ఉంటే మాత్రం మరికొంచెం జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి. అలాకాకుండా పిండి గట్టిగా ఉంటే చేతులు కొంచెం తడి చేసుకుని పిండిని మిక్స్ చేసుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. దానిలో నుంచి కొంచం కొంచం పిండిని తీసుకుంటూ సమాన పరిమాణంలో ఉండేలా ఉండలు చేసుకొని వాటిని గిన్నెలో వేసుకొని మూతపెట్టుకోవాలి. లేదంటే అవి గాలికి డ్రై అయిపోతాయి
  • ఇప్పుడు ఒక ప్లేట్​లో కొద్దిగా జొన్న పిండిని తీసుకోవాలి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని పిండిలో డిప్ చేసుకొని వెంటనే చపాతీ కర్రతో రోల్ చేసుకోకుండా అరచేతితో చపాతీలా కొంచం పల్చగా ఒత్తుకోవాలి.
  • అనంతరం చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒత్తుకున్న పిండి ముద్దను ఉంచి దానిపై కొంచం పొడి పిండి వేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. అయితే, ఆవిధంగా రోల్ చేసుకునేటప్పుడు రొట్టె అనేది పీట మీద కదులుతూ ఉండాలి.
  • అలా కదులుతూ ఉండాలంటే పీట అడుగున పొడి పిండి ఉండడం చాలా అవసరం. అలాకాకుండా పిండి పీటకు అతుక్కుంటుంటుంటే మాత్రం రొట్టెను కాస్త లేపి పొడి పిండిని వేసుకోవాలి.
  • రోల్ చేసేటప్పుడు చపాతీలా ముందుక్కి, వెనక్కి రోల్ చేయొద్దు. అంటే.. ముందుకి రోల్ చేసుకోవాలి. లేదంటే వెనక్కి రోల్ చేసుకోవాలి. అంతేకానీ.. ముందుకి, వెనక్కి ఒకేసారి రోల్ చేయకండి. ఆవిధంగా పిండి మొత్తం పల్చని రొట్టెగా మారేవరకు స్మూత్​గా రోల్ చేసుకోవాలి.
  • ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే జొన్నరొట్టెను చపాతీ కర్రతో చాలా సులువుగా.. పల్చగా.. ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత వేడివేడి పెనం మీద జొన్నరొట్టెను వేసి అర నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత కొన్ని నీళ్లను చల్లి రొట్టెపై తడి చేయండి లేదంటే తడి గుడ్డతో తుడుచుకోండి.
  • మళ్లీ ఒక అర నిమిషం తర్వాత రొట్టెను ఫ్లిప్‌ చేసి నిదానంగా రెండు వైపులా కాల్చుకోవాలి.
  • అయితే, జొన్న రొట్టెలు కాలడానికి కొంత టైమ్‌ పడుతుంది. త్వరగా కాల్చితే.. రంగు వస్తాయి కానీ, లోపల పిండి ఉడకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • కాబట్టి, నెమ్మదిగా రొట్టెలను కాల్చుకోవాలి. ఈ రొట్టెలు సరిగ్గా కాలితే పొంగు వస్తాయి. ఆపై వాటిని వేడివేడిగా హాట్‌ బాక్స్‌లో పెట్టుకుంటే చాలు. చాలా సమయం రొట్టెలు సాఫ్ట్‌గా ఉంటాయి.
  • ఇక వీటిని వేడివేడిగా ఏ కర్రీలో తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది!

ఇవీ చదవండి :

సూపర్ న్యూస్ : బరువు తగ్గాలంటే ఈ రొట్టె తినండి - కొవ్వును పిండేస్తుంది!

షుగర్ పేషెంట్లకు చక్కటి ఆహారం - "జొన్న దోశలు" ఇంట్లోనే చాలా ఈజీగా - రుచి అమోఘం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.