ETV Bharat / offbeat

హైదరాబాద్​ To శ్రీలంక - రామాయణ ఇతిహాసాలు చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ!

-బడ్జెట్​ ధరలోనే ఆరు రోజుల ప్యాకేజీ -హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ

IRCTC SRILANKA TOUR
IRCTC Sri Lanka Ramayana Yatra (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

IRCTC Sri Lanka Ramayana Yatra with Shankari Devi Shakthi Peeth: శ్రీలంక.. రామాయణ కాలం నాటి పురాతన చరిత్ర కలిగిన ద్వీప దేశం. ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాలు అక్కడ ఉంటాయి. మరి ఆ ప్రదేశాలను మీరూ చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు ఉంటుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం.

ఐఆర్​సీటీసీ.. శ్రీలంక రామాయణ్​ యాత్ర విత్​ శంకరీ దేవి శక్తి పీఠం పేరుతో ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో కొలంబో, దంబుల్లా, కాండీ, నువారా ఎలియాలోని రామాయాణికి సంబంధించిన ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాద్(Hyderabad Airport) అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు వెళ్తారు. మార్గమధ్యలో చిలావ్‌లోని మునీశ్వరం ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మనవేరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు చేరుకుంటారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • రెండో రోజు హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత దంబుల్లా కేవ్​ టెంపుల్​ దర్శించుకుంటారు. మధ్యాహ్నం లంచ్​ తర్వాత ట్రింకోమలీకి వెళ్లి తిరుకోణేశ్వర్, లక్ష్మీనారాయణ పెరుమాల్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి దంబుల్లాకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేయాలి.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ ​ తర్వాత కాండీకి వెళ్తారు. ఇక ఆ రోజంతా కాండీలో పలు ప్రసిద్ధి చెందిన.. జెమ్స్ ఫ్యాక్టరీ / బాటిక్ ఫ్యాక్టరీ, టూత్ టెంపుల్ ( ప్రపంచ ప్రసిద్ధ గౌతమ బుద్ధుని ఆలయం) వంటి ప్రదేశాలను విజిట్​ చేస్తారు. సాయంత్రం కూడా పలు ప్రదేశాలు విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి కాండీలో బస ఉంటుంది.
  • నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత నువారెలియా వెళ్తారు. మార్గ మధ్యలో రాంబోడాలోని భక్త హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత సీత అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక సందర్శించి ఆ తర్వాత తిరిగి కాండీకి చేరుకుంటారు. ఆ రాత్రికి కాండీ హోటల్​లో బస ఉంటుంది.
  • ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని సందర్శిస్తారు. తర్వాత కొలంబో పయమవుతారు. పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం కొలంబోలో షాపింగ్​ చేసి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అవ్వాలి. మధ్యాహ్నం వరకు కొలంబోలని పలు ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ఆ​ తర్వాత ఎయిర్​పోర్ట్​లో డ్రాప్​ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో నుంచి బయలుదేరి సాయంత్రానికి హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధరలు ఇవే:

  • సింగిల్​ షేరింగ్​కు రూ.83,170, డబుల్​ షేరింగ్​కు రూ.68,420, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.67,480 చెల్లించాలి.
  • ఇక పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.43,400, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.41,160 పే చేయాలి.

ఈ ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • ఫ్లైట్​ ఛార్జీలు
  • హోటల్​ అకామిడేషన్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​, 5 లంచ్​, 5 డిన్నర్​లు ఉంటాయి.
  • టూర్​ గైడ్​ అందుబాటులో ఉంటారు.
  • ప్యాకేజీలో చెప్పిన ప్రదేశాల ఎంట్రీ ఫీజులు కవర్​ అవుతాయి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 28వ తేదీన అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్​కు సంబంధించి పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అటు ఆధ్యాత్మిక దర్శనాలు - ఇటు పర్యాటక ప్రదేశాలు - IRCTC అద్భుత ప్యాకేజీ! ధర కూడా తక్కువేనండోయ్​!

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.