ETV Bharat / offbeat

IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు! - IRCTC SOUTH INDIA TEMPLE TOUR

-అందుబాటు ధరలోనే ఐఆర్​సీటీసీ అద్భుతమైన ప్యాకేజీ -హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ

IRCTC South India Temple Tour
IRCTC South India Temple Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 9:29 AM IST

IRCTC South India Temple Tour: దక్షిణ భారత దేశంలో చూడదగ్గ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా కేరళ, తమిళనాడులోని దేవాలయాలు కొన్ని. ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్దిరిపోయే శుభవార్త చెప్పింది. కేరళ, తమిళనాడులోని ప్రముఖ తీర్థాలను చూసేందుకు ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్​ అవుతాయి అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఐఆర్​సీటీసీ "సౌత్ ఇండియా టెంపుల్ రన్" పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువనంతపురం వంటి ప్రదేశాలు చూడొచ్చు. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్​ నిర్వహిస్తున్నారు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రెండు గంటల జర్నీ తర్వాత తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్​ పూర్తి చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​లో చెకిన్​ అవ్వాలి. ఆ తర్వాత బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసి నేపియర్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం పూవార్ ఐలాండ్​ చూస్తారు. సాయంత్రం అజిమాలా శివాలయం దర్శించుకుంటారు. ఆ రాత్రికి త్రివేండ్రంలో బస చేస్తారు.
  • రెండో రోజు తెల్లవారుజామున శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్తారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బ్రేక్​ఫాస్ట్​ చేసి కన్యాకుమారి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్​లో చెకిన అనంతరం సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. ఆ రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేయాలి.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత వాటర్​ మధ్యలో అద్భుతంగా నిర్మించిన రాక్ మెమోరియల్ సందర్శిస్తారు. అనంతరం రామేశ్వరం బయలుదేరి.. సాయంత్రానికి అక్కడికి చేరుకుంటారు. ఆ రాత్రికి రామేశ్వరంలోనే భోజ‌నం, స్టే ఉంటుంది.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్ చేసిన త‌ర్వాత‌ రామేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం ధనుష్కోటిలోని పలు ప్రసిద్ధ ఆలయాలు చూడొచ్చు. (అయితే రామేశ్వరంలోనికి బస్సుల అనుమతి ఉండదు. ఇతర ఆలయాలను సందర్శించటానికి ఐఆర్‌సీటీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఇతర రవాణా ఏర్పాట్లను ప్రయాణికులే సమకూర్చుకుని.. దానికయ్యే ఖర్చులూ యాత్రికులే భరించాల్సి ఉంటుంది.) రాత్రికి రామేశ్వరంలో భోజ‌నం, బస ఉంటుంది.
  • ఐదో రోజు అల్పాహారం చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి అబ్దుల్ కలాం మెమోరియల్‌ సందర్శన ఉంటుంది. అనంత‌రం తంజావూరుకు స్టార్ట్​ అవుతారు. అక్క‌డ బృహదీశ్వర ఆలయాన్ని ద‌ర్శించుకుని తిరుచిరాపల్లికి బయలుదేరుతారు. ఆ రాత్రికి అక్కడే భోజ‌నం, బస ఉంటుంది.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంత‌రం శ్రీరంగం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత మధురై బయలుదేరాలి.. సాయంత్రానికి అక్కడికి చేరుకుని హోటల్​లో చెకిన్​ అవుతారు. రాత్రికి మధురైలోనే బస చేయాలి.
  • ఏడో రోజు ఉదయం టిఫెన్ చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అక్క‌డ‌ నుంచి మీనాక్షి అమ్మవారిని ద‌ర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురై ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు (6E 6782) విమానంలో హైదరాబాద్‌కు పయనమవుతారు. 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవటంతో టూర్​ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలివే:

  • రూమ్‌లో సింగిల్‌ ఆక్యుపెన్సీ అయితే ఒకరికి రూ.47,500, డబుల్ షేరింగ్​కు రూ.35,750, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.34,000 చెల్లించాలి.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్‌ బెడ్‌ అయితే రూ.30,500, వితౌట్‌ అయితే రూ.25,700 పే చేయాలి.
  • 2 నుంచి 4 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.20,000 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవీ..

  • హైదరాబాద్‌- తిరువనంతపురం/ మధురై- హైదరాబాద్‌ ఫ్లైట్​ టికెట్లు.
  • హోటల్​ అకామిడేషన్​
  • ఆరు రోజుల పాటు అల్పాహారం, నాలుగు రోజుల పాటు రాత్రి భోజనం.
  • పర్యాటక ప్రదేశాలు వీక్షించడానికి ప్యాకేజీని బట్టి బస్సు
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌ అందుబాటులో ఉంటారు.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ 2025 ఫిబ్రవరి 1న అందుబాటులో ఉంది.
  • ప్యాకేజీ ఇతర వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

దుబాయ్​ బుర్జ్​ ఖలీఫా టూర్ - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ఇంకా మరెన్నో ప్రదేశాలు!

IRCTC "గోల్డెన్​ సాండ్స్​ ఆఫ్​ రాజస్థాన్​" - అందుబాటు ధరలోనే ఆరు రోజుల ప్యాకేజీ - ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!

IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ - తక్కువ ధరలోనే అయోధ్య, వారణాసి కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.