ETV Bharat / offbeat

మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ తయారీకి టైమ్​ లేదా? - ఈ "ఇన్​స్టంట్ దోశ"ను ట్రై చేయండి - 5 నిమిషాల్లోనే రెడీ! - Instant Dosa Recipe

author img

By ETV Bharat Features Team

Published : 3 hours ago

Instant Dosa Recipe : దోశ తినాలంటే దానికి ఎంతో ఓపిక కావాలి. టైమ్ కావాలి. అప్పుడే తినగలం. కానీ.. కేవలం 5 నిమిషాల్లో ఇన్​స్టంట్​గా దోశలు వేసుకునే అవకాశం కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

DOSA RECIPE WITH WHEAT FLOUR
Instant Dosa Recipe (ETV Bharat)

Instant Dosa Recipe with Wheat Flour : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మార్నింగ్ టైమ్ లేకనో, ఇంకేదైనా కారణం చేతనో చాలా మంది హోటల్, టిఫెన్ సెంటర్స్​లో బ్రేక్​ఫాస్ట్ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఇన్​స్టంట్​ దోశ. ఇంట్లోనే కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంతకీ.. ఈ ఇన్​స్టంట్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - అర టీస్పూన్
  • మిరియాల పొడి - అర టీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 1
  • చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరనూ సన్నని తరుగులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర తరుగు.. ఇలా ఒక్కొక్కొటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. అయితే, పిండిని మరీ గట్టిగా, జారుడుగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై దోశ పాన్ పెట్టుకొని వేడిచేసుకోవాలి. అది బాగా హీట్ అయ్యాక.. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గరిటెతో కొద్దిగా తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • అయితే.. మరీ పల్చగా వేసుకుంటే దోశ సరిగా రాదు. కాబట్టి కాస్త మందంగా ఉండేలా వేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువ మందంగా వేసుకోవద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఆ విధంగా దోశ వేసుకున్నాక దానిపైన, చుట్టుపక్కల కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. అయితే.. ఈ రెసిపీని పిల్లలకు చేసిచ్చినట్లయితే ఆయిల్​కి బదులుగా నెయ్యిని వేసుకోవచ్చు. అప్పుడు దోశ మరింత రుచికరంగా ఉంటుంది. పిలల్లూ ఎంతో ఇష్టంగా తింటారు.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి దోశను ఒక సైడ్ బాగా కాల్చుకోవాలి. అలా కాలిందనుకున్నాక దోశను రెండో సైడ్​ తిప్పుకొని లైట్​గా కాల్చుకుని సర్వే చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఇన్​స్టంట్ దోశ" రెడీ!
  • ఇక ఈ దోశలను టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి చట్నీ వంటి కాస్త పుల్లగా ఉండే చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి చేసుకునే టైమ్​ లేనప్పుడు ఇంట్లో ఉండే ఆవకాయతో తిన్నా ఈ దోశలు చాలా రుచికరంగా ఉంటాయి!

ఇవీ చదవండి :

నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్​ ఛాయిస్​ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!

ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.