How to Wash Bra: చక్కటి ఎద సౌష్టవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం సర్వ సాధారణమే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్ ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, బ్రాలెట్, స్పోర్ట్స్ బ్రా, స్ట్రాప్‌లెస్ వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు. అయితే వీటిని ధరించే వరకు బాగానే ఉన్నా.. క్లీనింగ్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. లోదుస్తులే కదా అని.. నచ్చినట్లు ఉతికేసి, వాడేస్తుంటాం. అయితే దీనివల్ల వాటి నాణ్యత దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. అయితే అవి ఎక్కువ కాలం మన్నాలంటే ఈ టిప్స్ యూజ్ అవుతాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
- చాలా మంది సాధారణ దుస్తులతో పాటు బ్రాలను కూడా వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. అయితే మెషీన్‌లో వేసే ముందు వాటి హుక్స్‌ని పెట్టేయాలని.. లేదంటే ఉతికే క్రమంలో హుక్స్ విరిగిపోవడంతో పాటు బ్రా కూడా సాగుతుందని నిపుణులు అంటున్నారు.
- ఎలాగు దుస్తులు వాషింగ్ మెషీన్లో వేస్తున్నాం కదా.. బ్రాలు కూడా వేస్తే ఓ పని అయిపోతుంది అనే ఆలోచనతో చాలా మంది వాటిని మెషీన్‌లో వేస్తుంటారు. అయితే మెషీన్లో కంటే చేతితో ఉతికితేనే బ్రాలు ఎక్కువ కాలం మన్నుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాషింగ్ సైకిల్ ఎక్కువ సమయం ఉండడం వల్ల అవి త్వరగా సాగిపోతాయని.. అదే చేత్తో అయితే ఐదు నిమిషాల్లో ఉతికి ఆరేయచ్చంటున్నారు.
- ఒకవేళ బ్రాలను వాషింగ్ మెషీన్లో వేయాలనుకున్నప్పుడు వాటిని వాషింగ్ బ్యాగ్స్‌లో వేసి మెషీన్లో వేయడం మంచిదంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్రా వాషింగ్ బ్యాగ్స్ దొరుకుతున్నాయని.. ఇవి ప్రత్యేకంగా వీటి కోసమే రూపొందించారంటున్నారు. కాబట్టి.. బ్రాలను ఇందులో పెట్టి వాషింగ్ మెషీన్‌లో వేసేయచ్చు. తద్వారా అవి సాగిపోకుండా ఉంటాయని.. ఒకవేళ వాషింగ్ బ్యాగ్స్ లేకపోతే దిండు కవర్లైనా వాడుకోవచ్చంటున్నారు.
- చాలా మంది బ్రాల మీద ఉండే దుమ్ము, ధూళితో పాటు బ్యాక్టీరియా నశించాలని వేడినీటితో వాష్ చేస్తుంటారు. అయితే మరీ ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో బ్రాలను ఉతకడం వల్ల కొన్నాళ్లకు వాటిలోని ఎలాస్టిక్, వైర్ తరహా మెటీరియల్ దెబ్బతింటుందని.. తద్వారా బ్రాలు త్వరగా పాడైపోతాయంటున్నారు. అందుకే వేడి నీళ్లకు బదులుగా గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.
ఇవి కూడా:
- ప్యాడెడ్ బ్రాలను ఉతికేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వాటి లోపల ఉండే మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్ డ్యామేజ్ కాకుండా చేత్తోనే సున్నితంగా ఉతకడం మంచిదని.. తద్వారా అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయంటున్నారు.
- బ్రాలను ఎక్కువసేపు డిటర్జెంట్‌లో నానబెట్టినా వాటి నాణ్యత దెబ్బతింటుందని.. కాబట్టి ఐదు పది నిమిషాలు నాననిచ్చి వాష్ చేస్తే సరిపోతుందని అంటున్నారు.
- బ్రాలను ఇతర దుస్తుల్లా వేలాడదీయకూడదని.. పరిచినట్లు ఆరేయడం మంచిదంటున్నారు. వేలాదీయడం వల్ల వాటి పట్టీలు సాగిపోయి.. కొద్దిరోజులకే పాడవుతాయంటున్నారు.
- బ్రాలు ఆరాక బీరువాలో/కప్‌బోర్డ్‌లో ఓ మూలన పడేయడం కాకుండా.. వాటి హుక్స్‌ని పెట్టి.. మడతేసి కప్‌బోర్డ్‌లో నీట్‌గా పెట్టాలంటున్నారు.
'బ్రా’ వేసుకోవడం మంచిదా..? కాదా..? ఈ స్టోరీ చదవండి..
అలర్ట్: బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే!