How to Store Chapati Dough in Fridge: చాలా మంది బరువు తగ్గాలనో లేదా లైట్‌గా డిన్నర్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో రాత్రి సమయంలో చపాతీలు తింటుంటారు. అలాగే బీపీ, షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా కనీసం రోజులో ఒకపూటైనా చపాతీలను ఆహారంగా తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది మహిళలు ఒకేసారి రెండు, మూడు రోజుల వరకు సరిపడా చపాతీ పిండి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటే చపాతీలు సులభంగా చేసుకోవచ్చని భావిస్తుంటారు. కానీ, పిండిని నేరుగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల త్వరగా పులిసిపోవడంతో పాటు, పైన నల్లటి పొర లాంటిది ఏర్పడుతుంది. ఇలాంటి పిండితో చపాతీలు చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని టిప్స్ పాటించి చపాతీ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల తాజాగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో మీరు చూసేయండి..
ఐస్‌క్యూబ్స్‌తో : సాధారణంగా చాలా మంది చపాతీ పిండి కలపడం కోసం నార్మల్ వాటర్ యూజ్ చేస్తుంటారు. మీరు అప్పటికప్పుడే పిండిని పూర్తిగా ఉపయోగిస్తే.. నార్మల్ వాటర్ వాడడం మంచిది. కానీ, మీరు పిండిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలనుకుంటే.. నీటిలో కొన్ని ఐస్‌క్యూబ్స్ వేయండి. తర్వాత ఆ కూల్ వాటర్‌తో చపాతీ పిండి ప్రిపేర్ చేయండి. ఇక మిగిలిన పిండిని ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఇలా చేయడం వల్ల పిండి తాజాగా ఉండడంతో పాటు, పైన నల్లటి పొర ఏర్పడదు.
కొన్ని నీళ్లు వాడండి : కొంతమంది చపాతీల పిండి కలిపేటప్పుడు అందులో పాలు, నీళ్లు ఎక్కువగా పోస్తుంటారు. అయితే, పిండిలోని నీళ్లు, ఇతర పదార్థాలే త్వరగా పాడయ్యేలా చేస్తాయి. కాబట్టి, చపాతీ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే వారు.. కాస్త తక్కువ నీటితో పిండి రెడీ చేసుకోవాలి. దీనిని ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత అవసరం ఉన్నప్పుడు కొన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవచ్చు.
ఈ టిప్స్ కూడా :
- మిగిలిన చపాతీ పిండిని అల్యూమినియం ఫాయిల్ కవర్లో లోపల గాలి లేకుండా.. దగ్గరకు చుట్టూ చుట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి. తర్వాత పిండిని బయటకు తీసి ఉపయోగించుకుంటే సరిపోతుంది.
- చపాతీ పిండి స్టోర్ చేయడానికి మీరు జిప్‌లాక్ బ్యాగులు, గాలి చొరబడని డబ్బాలను కూడా ఉపయోగించవచ్చు.
- చపాతీ పిండి ఫ్రిడ్జ్‌లో తాజాగా ఉండేందుకు మీరు చపాతీ ముద్దని ప్లాస్టిక్ ర్యాప్‌లో కూడా చుట్టి ఉంచవచ్చు.
- ఫ్రిడ్జ్‌లో చపాతీ పిండి ముద్ద పెట్టేటప్పుడు దానిపై నూనె లేదా నెయ్యిని ఒక పొరలాగా పోయాలి. ఆపై ఎయిర్‌టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే పాడైపోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- నచ్చితే మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోండి..!
ఎంత తొలగించినా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా? - ఇలా చేశారంటే ఆ సమస్యే ఉండదిక!
ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు, కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా? - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్!