ETV Bharat / offbeat

టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి- వేడి వేడి అన్నంలో అయితే వేరే లెవల్​! - tomato kothimeera chutney

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 1:41 PM IST

Tomato Kothimeera Chutney : కొంతమంది కూరల కంటే పచ్చళ్లనే ఎక్కువగా ఇష్టంగా తింటుంటారు. అందులోనూ ఎక్కువ మంది ఇష్టపడే వాటిలో టమాట చట్నీ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి టేస్టీ టమాటా చట్నీని కొత్తిమీరతో కలిపి ఎలా ప్రిపేర్​ చేయాలో తెలుసుకుందామా?

tomato kothimeera chutney
tomato kothimeera chutney (ETV Bharat)

Tomato Kothimeera Chutney : టమాటా పచ్చడి అంటే అందరికీ ఇష్టమే! వేడి వేడి నెయ్యి అన్నంలో తింటే మాటలే ఉండవ్​! టిఫిన్​ సెంటర్​, బజ్జీల బండి, స్నాక్స్​ ఇలా ప్రతిదాంట్లోనూ టమాటా పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అట్టు, ఇడ్లీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని.. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు. కానీ ఇప్పుడు చెప్పే పద్ధతి ప్రకారం చేస్తే మాత్రం.. వావ్ అనాల్సిందే! ఇందులోకి ఏయే పదార్థాలు కావాలి? తయారీ విధానం ఎలా ఉండాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక టీ స్పూన్​ నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ మెంతులు
  • ఒక టేబుల్ స్పూన్ శెనగపప్పు
  • ఒక టేబుల్ స్పూన్ మినపప్పు
  • ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
  • 10 ఎండు మిర్చీలు
  • 8 వెల్లుల్లి ముక్కలు
  • 10 పచ్చిమిరపకాయలు
  • 5 అల్లం ముక్కలు
  • అర కిలో టమాటలు (బాగా పండినవి అయితే బెటర్)
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక కట్ట కొత్తిమీర
  • 2 టేబుల్​ స్పూన్ల చింతపండు రసం

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్​ చేసుకుని కడాయిని పెట్టి వేడయ్యాక నూనె పోయాలి.
  • ఆ తర్వాత ఆవాలు, మెంతులు వేసి చిటపటమనేలా వేయించుకోవాలి.
  • అనంతరం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండు మిర్చీ వేసి సుమారు 3 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి.
  • అందులోనే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వేసి సుమారు 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి నీరు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం అదే కడాయిలో నూనె పోసుకుని టమాటలు, ఉప్పు వేసి బాగా కలుపుకుని మూతపెట్టాలి.
  • ఇలా మధ్య మధ్యలో కలుపుతూ టమాటలు మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత చింతపండు రసం, కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. (ఎక్కువ సేపు మగ్గనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది)
  • ఈ మిశ్రమాన్ని అంతకుముందు గ్రైండ్ చేసుకున్న తాళింపులో వేసుకోవాలి.
  • ఆ తర్వాత పసుపు వేసి నీరు లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అంతే టేస్టీ టేస్టీ టమాట కొత్తిమీర పచ్చడి రెడీ! ఇక మీ ఇష్టం.. ఎందులో వేసుకుని తిన్నా రుచి మాత్రం అదిరిపోతుంది!

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​! - Brinjal Tomato Chutney

టిఫిన్ సెంటర్ రుచిలో​ 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ! - Tomato Mint Chutney Recipe

నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు! - Polam Pachadi Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.